తెలంగాణ

telangana

ETV Bharat / international

అగ్రరాజ్యంలో ప్రఖ్యాత సంస్థ డైరెక్టర్​గా భారతీయ అమెరికన్​

అమెరికాలోని ప్రఖ్యాత 'నేషనల్​ సైన్స్​ ఫౌండేషన్'​ డైరెక్టర్​గా భారతీయ అమెరికన్​ శాస్త్రవేత్త ఎంపికయ్యారు. ప్రముఖ శాస్త్రవేత్త సేతురామన్​ పంచనాథన్​కు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సెనేట్​ ధ్రువీకరించింది.

US-INDIAN-SCIENTIST
సేతురామన్​ పంచనాథన్

By

Published : Jun 20, 2020, 2:02 PM IST

అమెరికా 'నేషనల్​ సైన్స్​ ఫౌండేషన్​'(ఎన్​ఎస్​ఎఫ్​) డైరెక్టర్​గా ప్రముఖ భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్​ సేతురామన్​ పంచనాథన్​ బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ విషయాన్ని అమెరికా సెనేట్​ ధ్రువీకరించింది. ఇంజినీరింగ్​, సైన్స్​ విభాగాల్లోని వైద్యేతర రంగాల్లో ప్రాథమిక పరిశోధనలకు సహకరిస్తున్న ఎన్​ఎస్ఎఫ్​ అమెరికా అగ్ర సంస్థల్లో ఒకటి.

ప్రస్తుతం డైరెక్టర్​గా ఉన్న ఫ్రాన్స్​ సీ డోవా పదవీకాలం మార్చితోనే ముగిసింది. జులై 6న ఎన్​ఎస్​ఎఫ్​ 15వ డైరెక్టర్​గా సేతురామన్​ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రెండో వ్యక్తి..

ఈ స్థాయిని చేరుకున్న రెండో భారతీయ అమెరికన్​గా సేతురామన్​ నిలిచారు. ఇంతకుముందు డాక్టర్​ సుబ్రా సురేశ్​ 2010 అక్టోబర్​- 2013 మార్చి వరకు డైరెక్టర్​గా సేవలందించారు. సేతురామన్ అందించిన సేవల కారణంగా ఆయనకు రిపబ్లికన్లతో పాటు డెమొక్రాట్ల మద్దతు కూడా ఉందని ఇండియాస్పొరా వ్యవస్థాపకులు రంగస్వామి తెలిపారు.

ఐఐటీ మద్రాసు నుంచి..

భారత్​లో 1961 జూన్​ 24న పుట్టారు సేతురామన్​. ఐఐటీ మద్రాస్​, ఐఐఎస్​సీ బెంగళూరు వంటి ప్రముఖ సంస్థల్లో చదువుకున్నారు​. అనంతరం 1989లో ఒట్టావా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్​డీ పట్టా పొందారు. ప్రస్తుతం అరిజోనా రాష్ట్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. అమెరికాకు చెందిన కొన్ని జాతీయ సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేశారు​.

ABOUT THE AUTHOR

...view details