శ్వాసమార్గం ద్వారా శరీరంలోకి వ్యాక్సిన్ను పంపే సరికొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనివల్ల ఊపిరితిత్తులకు, శ్వాస వ్యవస్థకు ఎలాంటి హాని ఉండదని వారు చెబుతున్నారు. ఇప్పటికే ఎలుకలపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని.. కొవిడ్-19 వంటి రుగ్మతల చికిత్సకూ ఈ విధానం అనువుగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు.
సాధారణంగా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత శరీరంలో ప్రతికూలతలు ఏర్పడటం సహజం. శరీరంలో జరిగే మార్పుల కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే.. శ్వాసమార్గం ద్వారా టీకా ఇవ్వడం వల్ల ఔషధ పనితీరు మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యాక్సిన్ ప్రతికూలతలూ తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.