తెలంగాణ

telangana

ETV Bharat / international

పారిస్‌ వాతావరణ ఒప్పందంలోకి అమెరికా పునరాగమనం! - పారిస్​ వాతావరణ ఒప్పందం 2015

2015 పారిస్​ వాతావరణ ఒప్పందంలోకి అమెరికా మళ్లీ పునరాగమనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాను పగ్గాలు చేపట్టిన తొలిరోజే ఈ ఒడంబడికలో చేరతామని అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​ తెలిపారు.

US returns to Paris climate deal
పారిస్‌ వాతావరణ ఒప్పందంలోకి అమెరికా పునరాగమనం!

By

Published : Dec 13, 2020, 7:34 AM IST

పారిస్‌ వాతావరణ ఒప్పందంలో అమెరికా మళ్లీ చేరనుంది! తాను పగ్గాలు చేపట్టిన తొలిరోజే ఈ ఒడంబడికలోకి అగ్రరాజ్య పునరాగమనం ఉంటుందని అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్‌ శనివారం ప్రకటించారు.

తాము బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లో ముఖ్య ఆర్థిక సమాజాల నేతలతో సమావేశం నిర్వహిస్తామన్నారు బైడెన్​. భూతాపాన్ని తగ్గించేందుకు 2015లో పారిస్‌ వేదికగా చేసుకున్న ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు 2017లో అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. కాలుష్యానికి భారత్‌, చైనాలు ప్రధాన కారణమవుతున్నాయనీ... ఈ ఒప్పందంతో తాము ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. 2025 నాటికి 25లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:సోమవారం నుంచే అమెరికాలో టీకా పంపిణీ!

ABOUT THE AUTHOR

...view details