అమెరికాలో మళ్లీ విజృంభిస్తున్న మశూచి అగ్రరాజ్యం అమెరికాను మశూచి(తట్టు, పొంగు) వణికిస్తోంది. 2019లో ఇప్పటివరకు 695 మశూచి కేసులు నమోదయ్యాయి. 2000వ సంవత్సరంలోనే దేశంలో పూర్తిగా మశూచిని నివారించామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ వ్యాధి విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది.
"2019లో మశూచి కేసులు అత్యధికంగా వాషింగ్టన్లో నమోదయ్యాయి. 2018 చివరిలో న్యూయర్క్లోనూ రెండు దఫాలుగా మశూచి విజృంభించింది."
- వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం, అమెరికా
ఇజ్రాయిల్, ఉక్రెయిన్ నుంచి అమెరికాకు వచ్చిన వ్యాధిగ్రస్తుల వల్ల మశూచి ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. టీకా వేయించుకోని వర్గాల్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోందని తెలిపారు.
2014లో అమెరికాలోని ఒహాయోలో 383 మశూచి కేసులు నమోదయ్యాయి. అగ్రరాజ్య చరిత్రలో అప్పటివరకు అదే అత్యధికం. ఇప్పుడు అందుకు దాదాపు రెట్టింపు సంఖ్యకు కేసులు పెరిగాయి.
ఇదీ చూడండి: 'ఏడాది పిల్లలకు ఫోన్ అసలు ఇవ్వొద్దు'