అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాజీ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) మైఖేల్ ఫ్లిన్కు క్షమాభిక్ష పెట్టారు. ఈ మేరకు సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు ట్రంప్. 2016 ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రచారం, రష్యాతో కుదిరిన ఒప్పందంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ)కు అసత్య నివేదికలు ఇచ్చినట్టు ఫ్లిన్పై అభియోగాలు ఉన్నాయి.
మైఖైల్ టీ. ఫ్లిన్కు క్షమాపణ చెప్పడంపై గౌరవంగా ఉందంటూ ట్వీట్ చేశారు ట్రంప్.
"జనరల్ మైఖేల్ టి. ఫ్లిన్కు క్షమాపణ మంజూరైనట్టు ప్రకటించడం గొప్ప గౌరవంగా ఉంది. ఫ్లిన్, అతని కుటుంబ సభ్యులకు అభినందనలు. మీకు ఇప్పుడు ధన్యవాదాలు చెప్పాలని ఉంటుదని నాకు తెలుసు."