తెలంగాణ

telangana

ETV Bharat / international

తిరిగొచ్చేయండి:దౌత్యాధికారులకు అమెరికా ఆదేశం

ఇరాక్​ రాజధాని నగరం బాగ్దాద్​తోపాటు ఎర్బిల్​లోని అమెరికా రాయబారి కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని వెనక్కి రావాలని ఆదేశాలు జారీ చేసింది ట్రంప్​ సర్కార్​. అత్యవసర సేవల్లో లేని సిబ్బంది వెంటనే స్వదేశానికి రావాలని సూచించింది​. ఇరాన్- అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణంగా పేర్కొంది.

తిరిగొచ్చేయండి:దౌత్యాధికారులకు అమెరికా ఆదేశం

By

Published : May 15, 2019, 8:48 PM IST

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, యుద్ధ నౌకల మోహరింపు నేపథ్యంలో గల్ఫ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా ఇరాక్​​ రాజధాని నగరం బాగ్దాద్​ సహా ఎర్బిల్​లోని అమెరికా రాయబారి కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది ట్రంప్​ సర్కార్​. అత్యవసర సేవల్లో లేని సిబ్బంది స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది​. ఇరాన్-అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

కొన్ని అమెరికా వ్యతిరేక ఉగ్ర సంస్థలతోపాటు, తిరుగుబాటు దారులు ఇరాక్​లోని అమెరికా పౌరులకు, పాశ్చాత్య దేశాల సంస్థలను బెదిరించే అవకాశాలున్నాయని అమెరికా అధికారులు హెచ్చరించారు. దౌత్యకార్యాలయాన్ని పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

దక్షిణ ఇరాక్​లోని బస్రాలో గల దౌత్య కార్యాలయాన్ని గతేడాదే మూసేసింది అమెరికా. ఇరాన్ మద్ధతుతో పరోక్షంగా తమ దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడటమే కారణంగా పేర్కొంది.

ఇదే మూల కారణం

అమెరికా-ఇరాన్​ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు మూల కారణం ఇరాన్ అణుఒప్పందాన్ని రద్దు చేయడమే. 2015లో ట్రంప్ సర్కార్​ ఇరాన్​తో అణుఒప్పందాన్ని రద్దు చేసినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇరాన్​పై ట్రంప్ కఠిన ఆంక్షలు

ఇటీవల కాలంలో ఇరాన్​పై ఆంక్షలను మరింత తీవ్రతరం చేసింది అమెరికా. ఇరాన్​​ నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు ఏ దేశానికి మినహాయింపు ఇవ్వబోమని ప్రకటించింది. ఇరాన్​కు ఆదాయ వనరులు లేకుండా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఇరాన్​ చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేయడమే తమ ధ్యేయమని ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి : ఎన్నికల సంఘం చరిత్రాత్మక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details