తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఓటర్లకు ఇరాన్​ 'ఈమెయిల్​'​ బెదిరింపులు! - అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ దేశ ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్​నకు ఓటు వేయాలని ఈ-మెయిల్స్​ ద్వారా డెమొక్రటిక్​ ఓటర్లను బెదిరిస్తున్నట్టు ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి ఈమెయిల్​ అడ్రస్​లను తీసుకున్నట్టు పేర్కొన్నారు.

US officials link Iran to emails meant to intimidate voters
అమెరికా ఓటర్లకు ఇరాన్​ 'ఈమెయిల్​'​ బెదిరింపులు!

By

Published : Oct 22, 2020, 9:56 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయా? అన్న ప్రశ్నకు అగ్రరాజ్య అధికారులు అవుననే సమాధానమిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్​నకు ఓటు వేయాలని.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న డెమొక్రటిక్​ ఓటర్లను ఇరాన్​ ఈమెయిల్స్​ ద్వారా బెదిరిస్తున్నట్టు అమెరికా ఉన్నతాధికారులు ఆరోపించారు.

అధ్యక్ష ఎన్నికలకు 13రోజుల ముందు ప్రభుత్వ అత్యున్నత నిఘా అధికారి జాన్​ రాట్​క్లిఫ్, ఎఫ్​బీఐ డైరక్టర్​ క్రిస్​ వ్రేయ్​ ఈ ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై వీరు హడావుడిగా విలేకరుల సమావేశం నిర్వహించడం, ఇరాన్​పై వేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను వెలువరించకపోవడం గమనార్హం.

ఈ చర్యలు.. అమెరికాలో అనిశ్చితి సృష్టించేందుకు శత్రు దేశాలు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు రాట్​క్లిఫ్​. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ఇలాంటి చర్యలకు పాల్పడిందని.. ఈసారి కూడా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలు చేసే దేశాలపై భారీ స్థాయిలో విరుచుకుపడతామని హెచ్చరించారు.

వివిధ రాష్ట్రాల ఓటర్ల జాబితా నుంచి ప్రజల ఈమెయిల్​ అడ్రస్​లు తీసుకుని ఇరాన్​ మెయిల్స్​ పంపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు కూడా అవకాశమున్నట్టు స్పూఫ్​లు రూపొందించి మెయిల్స్​ పంపుతున్నట్టు ఆరోపించారు. అయితే ఈ ఈమెయిల్స్​లో ఉన్న సందేశాల్లో నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:-'ఓట్లు వేయకపోతే ట్రంప్​ తిరిగొస్తారు.. జాగ్రత్త'

ABOUT THE AUTHOR

...view details