తెలంగాణ

telangana

ETV Bharat / international

కమలా హారిస్​ను చంపేస్తానంటూ బెదిరింపులు! - kamala harris

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను హతమారుస్తానని వచ్చిన బెదిరింపుల వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఓ నర్సును అదుపులోకి తీసుకున్నారు.

Kamala Harris
కమలా హారిస్

By

Published : Apr 18, 2021, 5:58 AM IST

Updated : Apr 18, 2021, 9:16 AM IST

అమెరికా ఉపాధ్యక్షురాలుగా కమలా హారిస్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఓ నర్సును పోలీసులు అరెస్టు చేశారు! ఇందుకు సంబంధించి పలు వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఫ్లోరిడాకు చెందిన నివియాన్​ పెటిల్​ ఫెల్ఫ్స్​(39)నర్సుగా పనిచేస్తోంది. ఆమె భర్త ప్రస్తుతం జైలులో ఖైదీగా ఉన్నాడు. ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు జేపే అనే కంప్యూటర్​ అప్లికేషన్​ ద్వారా మాట్లాడుకునే అవకాశముంది.

ఇలా ఫిబ్రవరి 13-18 మధ్య ఫెల్ప్స్​ తన భర్తతో మాట్లాడింది. ఆ సందర్భంగా కమలా హారిస్​కు ఉద్దేశపూర్వకంగా హాని తలపెట్టేలా ఫెల్ప్స్​ మాట్లాడినట్లు అమెరికా సీక్రెట్​ సర్వీస్​ అధికారులు గుర్తించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ల పట్ల విద్వేష వ్యాఖ్యలతో పాటు.. కోపంగా మాట్లాడుతూ ఉన్న వీడియోలను సీఎన్ఎన్ ఉటంకించింది. ఆ వీడియోలలో "కమలా హారిస్ త్వరలోనే చనిపోతారు. మీరు రోజులు లెక్కిస్తున్నారంటూ" ఫెల్ప్స్ పలు ప్రకటనలు చేసినట్లు సీఎన్​ఎన్​ పేర్కొంది.

మరో వీడియోలో.. "ఈ రోజును గుర్తుపెట్టుకోండి.. దేవుడిపై ప్రమాణం చేస్తున్నాను.. నేటి నుంచి 50 రోజుల్లో మీరు అంతం అవ్వబోతున్నారు. నేను తుపాకీ శ్రేణితో వస్తున్నాను.. మీరు చనిపోయే రోజు దగ్గర్లోనే ఉందంటూ" తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సీఎన్​ఎన్​ తన కథనంలో వివరించింది.

ఇవీ చదవండి:అమెరికాలో విషం చిమ్ముతున్న 'గన్​ కల్చర్​'

శృంగారాన్ని నిరాకరించే హక్కు మహిళలకు తక్కువే!

Last Updated : Apr 18, 2021, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details