అమెరికా నౌకాదళం భారత్ కోసం హిందీ పాట ఆలపించింది. యూఎస్ చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ (సీఎన్ఓ) మైఖేల్ గిల్డే, అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధు శనివారం ఓ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందీ పాటను పాడి అతిథులను సంతోషపరిచింది యూఎస్ నేవీ బ్యాండ్.
ఆ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు సంధు. "భారత్, అమెరికా మైత్రి ఎన్నటికీ విడదీయరానిది" అని పేర్కొన్నారు.
2004లో హిందీలో వచ్చిన 'స్వదేశ్' చిత్రంలోని 'యే జో దేశ్ హై తేరా' పాటను పాడింది నేవీ బ్యాండ్. సినిమాలో ఆ పాటను ఏఆర్ రెహమాన్ స్వయంగా పాడటమే కాక స్వరాలు సమకూర్చారు. ఈ వీడియోకు 196వేల మంది చూశారు. 15 లక్షల మంది లైక్ చేశారు.