అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో కొందరు దుండగులు మారణహోమం సృష్టించారు. మెక్సికో సరిహద్దు రాష్ట్రమైన రైనోసాలోని వివిధ ప్రాంతాల్లో కార్లలో తిరుగుతూ... విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 15 మంది మృతి చెందారు.
ఈ దాడులతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. అతడి కారులో డిక్కీలో ఉన్న ఇద్దరు మహిళలను రక్షించాయి. ఆ ఇద్దరిని ఆ దుండగుడు కిడ్నాప్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.