గల్ఫ్ ప్రాంతంలో తమ దేశానికి సంబంధించిన రెండు చమురు రవాణా నౌక (ఆయిల్ ట్యాంకర్లు)లపై అనూహ్య రీతిలో దాడి జరిగిందని సౌదీ అరేబియా సోమవారం ప్రకటించింది. దాడిలోట్యాంకర్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయని వెల్లడించింది. అమెరికా- ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న తరుణంలో ఈ దాడులు జరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది సౌదీ. నౌకలపై దాడిని ఖండిస్తూ... ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.
మాటల యుద్ధం...
తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఇరాన్‌పై మండిపడిందిఅమెరికా. ఇప్పటికే మధ్యప్రాచ్యంలోకి యుద్ధనౌకలను తరలించింది అగ్రరాజ్యం. 2018లో అణు ఒప్పందం నుంచి ట్రంప్ ప్రభుత్వం వైదొలగడం, ఇటీవలి కాలంలో ముడిచమురుపై అగ్రరాజ్యం తన ఆధిపత్యధోరణి ప్రదర్శిస్తోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.