తెలంగాణ

telangana

ETV Bharat / international

అణ్వాయుధాల వివరాలపై అమెరికా గోప్యత - అమెరికా

అణ్వాయుధ సంపత్తి, నిల్వల వివరాలను ప్రకటించకూడదని అమెరికా నిర్ణయించుకుంది. ఇందుకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. చివరిసారిగా 2017 సెప్టెంబర్​ 30న తమ వద్దనున్న అణు వార్​హెడ్ల వివరాలు ప్రకటించింది అగ్రరాజ్యం.

అమెరికా

By

Published : Apr 18, 2019, 11:31 AM IST

అణ్వాయుధ సంపత్తి, నిల్వల వివరాలను ప్రకటించకూడదని అమెరికా నిర్ణయించింది. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం ప్రస్తుతం తమ దేశం వద్ద ఉన్న అణ్వాయుధాల వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది. ఇందుకు కారణాలు మాత్రం చెప్పలేదు. అణ్వాయుధాల అంశంపై అధ్యయనం చేసే ప్రైవేటు బృందమైన అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్యకు... శక్తి ఉత్పాదక విభాగం రాసిన లేఖలో ఈ విషయం స్పష్టంచేసింది. జాతీయ భద్రతపై ఈ సంస్థ ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఉంటుంది.

2010లో మొదలు

2010లో చరిత్రలో మొదటిసారిగా అణ్వాయుధాల లెక్కను ప్రకటించింది అప్పటి బరాక్​ ఒబామా ప్రభుత్వం. 1945 నుంచి అప్పటివరకు ఎన్ని ఉన్నాయో వెల్లడించింది.

2009 సెప్టెంబర్​ 30 వరకు దాదాపు 5,113 'అణు వార్​హెడ్​'లు ఉన్నట్టు అమెరికా ప్రకటించింది. 1967లో 31,255 ఉన్నట్టు చెప్పింది. అప్పటితో పోలిస్తే 2009కి దాదాపు 84శాతం తగ్గాయి.

2017 సెప్టెంబర్​ 30 నాటికి 3,822 అణు వార్​హెడ్లు ఉన్నట్టు వెల్లడించింది ట్రంప్​ ప్రభుత్వం. 2015 కంటే 196 తగ్గినట్టు చెప్పింది.

2018కి సంబంధించిన అణ్వాయుధాల వివరాలు ప్రకటించాలని కొందరు శాస్త్రవేత్తలు డిమాండ్​ చేస్తున్నారు.

" చాలా విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత... వివరాలను ఈసారి వెల్లడించకూడదని నిర్ణయించుకున్నాం" అని ఈ నెల 5న శాస్త్రవేత్తల సమాఖ్యకు రాసిన లేఖలో అమెరికా అణుశక్తి విభాగం తెలిపింది. ఇందుకు ఎటువంటి కారణాలను చెప్పలేదు.

అసలు అణు సంపత్తిని వెల్లడించడం అనవసరమని, అది దేశానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుందని అణు సమాచార ప్రాజెక్టు డైరెక్టర్​ ఎం.క్రిస్టెన్​సన్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details