తెలంగాణ

telangana

ETV Bharat / international

మసూద్​పై చైనాతో 'రాజీ'చర్చలు - బ్రిటన్

జైషే మహ్మద్​ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి కసరత్తు జరుగుతోంది. అజార్​ విషయంపై చైనాతో ఐరాస భద్రతా మండలిలోని ముఖ్య సభ్యులైన అమెరికా, ఫ్రాన్స్​, బ్రిటన్ దేశాలు 'రాజీ'చర్చలు జరుపుతున్నాయి​. తమ చర్చలు విఫలమైతే ఇతర మార్గాల ద్వారా మసూద్​పై కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి.

మసూద్​పై చైనాతో 'రాజీ'చర్చలు

By

Published : Mar 16, 2019, 12:11 PM IST

Updated : Mar 16, 2019, 12:51 PM IST

మసూద్ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంపై చైనాతో చర్చలు జరపుతున్నాయి మూడు ఐరాస భద్రాత మండలి సభ్య దేశాలు. డ్రాగన్​ దేశంతో కొనసాగుతున్న ఈ 'రాజీ' చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని అమెరికా, ఫ్రాన్స్​, బ్రిటన్​ దేశాలు భావిస్తున్నాయి.

మార్పులు సూచించిన చైనా...

ఉగ్రవాదిగా గుర్తించడానికి ఐరాస అనుసరిస్తోన్న నిబంధనల్లో మార్పులు చేయాలని చైనా సూచించింది. ఈ సూచనలను మూడు దేశాలు పరిశీలుస్తున్నాయి. ఎప్పటికప్పుడు చైనాతో సంప్రదింపులు జరుపుతున్నాయి. సూచనలను అమలు చేసేందుకు సభ్య దేశాలు సుముఖంగా ఉన్నాయి. ఉగ్రవాదిని గుర్తించే తీర్మానంలో సారాంశం మారనంత వరకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపాయి.

బహిరంగ చర్చ...

మునిపటిలా కాకుండా చర్చలు తొందరగా ముగించాలని సభ్య దేశాలు ఆలోచిస్తున్నాయి. మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో వేరే మార్గాలను వెతుకుతున్నట్టు చైనాకు తేల్చి చెప్పాయి. అవసరమైతే బహిరంగ చర్చ జరిపి... ఓటింగ్​ విధానంతో ఫలితం రాబట్టే అవకాశాలను పరిశీలిస్తామన్నాయి.

మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐరాస భద్రతా మండలిలో అమెరికా, ఫ్రాన్స్​, బ్రిటన్ ప్రతిపాదన చేశాయి. కానీ మసూద్​ను ఉగ్రవాదిగా గుర్తించడానికి సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఆ ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. చైనా తీరుపై భారత్ సహా పలు దేశాలు​ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

Last Updated : Mar 16, 2019, 12:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details