తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్లోరిడా గజగజ - 252 కి.మీ వేగంతో గాలులు - భారీ ఆస్తి నష్టం

మైఖేల్​ పెనుతుపాను ఫ్లోరిడా నగరాన్ని వణికించింది. గంటకు 252 కి.మీ వేగంతో గాలులు వీచాయి. బీభత్సం సృష్టించాయి. తుపాను ధాటికి ఐదుగురు మరణించారు.

ఫ్లోరిడా గజగజ - 252 కి.మీ వేగంతో గాలులు

By

Published : Apr 20, 2019, 11:04 AM IST

ఫ్లోరిడా గజగజ - 252 కి.మీ వేగంతో గాలులు

అమెరికా ఫ్లోరిడాలో 'మైఖేల్​ పెనుతుపాను' బీభత్సం సృష్టించింది. ఈ పెనుతుపాను ధాటికి ఉడ్​విల్లేలో 8 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. మిసిసిపీలో ముగ్గురు, అలబామాలో ఓ మహిళ మరణించారు. ఇళ్లు, భవనాలు, వృక్షాలు కూలి భారీగా ఆస్తి నష్టం సంభవించింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. తీవ్ర నష్టం కలిగించిన ఈ తుపాను కేటగిరీ-5కు చెందినదిగా జాతీయ మహాసముద్ర, వాతావరణ యంత్రాంగం తెలిపింది.

మైఖేల్ హరికేన్​ మెక్సికో తీరం నుంచి గంటకు 145 కి.మీ వేగంతో ఫ్లోరిడా దిశగా పయనించింది. తరువాత విజృంభించి గంటకు 252 కి.మీ వేగంతో ఫ్లోరిడా వద్ద తీరం దాటిందని నేషనల్​ హరికేన్​ సెంటర్​ శాస్త్రవేత్తలు తెలిపారు.

1992 ఆండ్రూ పెనుతుపాను తర్వాత మళ్లీ ఇదే అంత తీవ్రమైన తుపాను. రికార్డుల పరంగా నాల్గవది కూడా.

ఇదీ చూడండి: స్పైస్​జెట్​లోకి 500 మంది జెట్​ ఉద్యోగులు

ABOUT THE AUTHOR

...view details