తెలంగాణ

telangana

ETV Bharat / international

విమానం ఆలస్యమైందని 3 లక్షల డాలర్ల జరిమానా

జపాన్​ ఎయిర్​లైన్స్ సంస్థకు అమెరికా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. ఈ ఏడాది జనవరి, మే నెలల్లో రెండు విమానాలు ఆలస్యంగా నడిపి.. ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన కారణంగా 3 లక్షల డాలర్ల జరిమానా వేసింది అగ్రరాజ్యం.

By

Published : Sep 14, 2019, 11:45 AM IST

Updated : Sep 30, 2019, 1:45 PM IST

జాప్యం కారణంగా జపాన్​ ఎయిర్​లైన్స్​కు భారీ ఫైన్!

జపాన్​కు చెందిన ఓ విమాన సంస్థకు 3 లక్షల డాలర్ల భారీ జరిమానా విధించింది అమెరికా. విమానాల ఆలస్యంతో పాటు.. అందులో ఉన్న ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేసిందనే కారణాలతో జపాన్​ ఎయిర్​లైన్స్​ సంస్థకు ఈ భారీ జరిమానా వేసినట్లు తెలిపింది.

రవాణా శాఖతో జరిగిన ఒప్పందం ప్రకారం.. ఇబ్బందులకు గురైన ప్రయాణీకులకు పరిహారం కింద 60,000 డాలర్లను చెల్లించాలి. ఏడాది పాటు ఆ సంస్థ విమానాలు జాప్యం లేకుండా నడిస్తే.. లక్షా 20 వేల డాలర్ల జరిమానా మాఫీ అవుతుంది.

ఆలస్యం ఎందుకు...

జనవరి 4న టోక్యో నుంచి న్యూయార్క్ బయల్దేరిన జపాన్​ ఎయిర్​లైన్స్ విమానం.. వాతావరణం సహకరించక చికాగోలో అర్ధంతరంగా దిగింది. విమానం దిగిన నాలుగు గంటల తర్వాత సిబ్బంది సేవలు నిలిపివేశారు. ఈ కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.

మే 15న టోక్యో నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన అదే సంస్థకు చెందిన మరో విమానం.. డాలస్ ఎయిర్​పోర్ట్​కు దారిమళ్లించి ల్యాండ్​ చేశారు. దాదాపు ఐదు గంటల పాటు ప్రయాణీకులు విమానంలో చిక్కుకున్నారు. ఇంధనం నింపుకోవడం, సిబ్బంది విధులు ముగించుకునే సమయం దగ్గరపడటం కారణంగా విమానం టేకాఫ్​లో జాప్యం జరిగింది. ఈ రెండు సందర్భాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉందని జపాన్ ఎయిర్​లైన్స్ తెలిపింది.

ఇదీ చూడండి: 'గూగుల్ ఎర్త్'​తో 22 ఏళ్ల మిస్టరీ వీడిందిలా!

Last Updated : Sep 30, 2019, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details