అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేతపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. పలు రాష్ట్రాల్లో బైడెన్ ముందంజలో ఉన్నప్పటికీ... ట్రంప్ అధిక్యంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే కీలక రాష్ట్రాలైన జార్జియా(16), ఉత్తర కరోలినా(15), పెన్సిల్వేనియా(20), మిషిగన్(16)లో ట్రంప్ ఆధిక్యంలో ఉండటం రిపబ్లికన్లకు సానుకూల అంశం. ఇదే సరళి కొనసాగితే.. ట్రంప్ మరోమారు శ్వేతసౌధానికి చేరడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్‌పై బైడెన్ పైచేయిలో ఉన్నారు. అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు 270 ఓట్లు పొందాలి.
ఇదీ చూడండి-ట్రంప్ X బైడెన్: గెలుపు మాదంటే మాదేనని..
ట్రంప్ గెలుచుకున్న రాష్ట్రాలు:-