తెలంగాణ

telangana

ETV Bharat / international

అధ్యక్ష పోరు: రాష్ట్రాల నిబంధనలతో ఫలితాల్లో తీవ్ర జాప్యం - అమెరికా ఎన్నికలు 2020

US ELECTIONS 2020
అమెరికా ఎన్నికలు 2020

By

Published : Nov 5, 2020, 7:00 AM IST

Updated : Nov 5, 2020, 7:32 PM IST

19:31 November 05

  • జార్జియా రాష్ట్రంలో ట్రంప్‌, బైడెన్ మధ్య హోరాహోరీ
  • జార్జియాలో ఇంకా లెక్కించాల్సి ఉన్న 50 వేల ఓట్లు
  • జార్జియా ఫలితం వెలువడేందుకు మరికొన్ని గంటలు పట్టే అవకాశం
  • ప్రస్తుతం జార్జియాలో భారీగా ఓట్లు సాధిస్తున్న బైడెన్‌
  • ఇదే ఒరవడి కొనసాగితే జార్జియాలో బైడెన్‌ గెలిచే అవకాశం

18:05 November 05

ఫలితాల్లో తీవ్ర జాప్యం

  • అమెరికా ఎన్నికల ఫలితాల్లో తీవ్ర జాప్యం
  • జాప్యానికి కారణమవుతున్న రాష్ట్రాల ఎన్నికల నిబంధనలు
  • మరో 5 రాష్ట్రాల్లో ఇంకా వెలువడాల్సిన ఫలితాలు
  • ఫలితాలు రావాల్సిన రాష్ట్రాలు: పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలైనా
  • ఫలితాలు రావాల్సిన రాష్ట్రాలు: జార్జియా, నెవాడా, అలాస్కా
  • ఇప్పటివరకు 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన జో బైడెన్‌
  • ఇప్పటివరకు 214 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన ట్రంప్‌

జార్జియా

  • జార్జియా రాష్ట్రంలో ట్రంప్‌, బైడెన్ మధ్య హోరాహోరీ
  • జార్జియాలో 18 వేల 500 ఓట్లకు తగ్గిన ట్రంప్‌ ఆధిక్యం
  • ప్రస్తుతం జార్జియాలో భారీగా ఓట్లు సాధిస్తున్న బైడెన్‌
  • ఇదే ఒరవడి కొనసాగితే జార్జియాలో బైడెన్‌ గెలిచే అవకాశం
  • జార్జియా ఫలితం వెలువడేందుకు మరికొన్ని గంటలు పట్టే అవకాశం
  • జార్జియాలో ఇప్పటికే 96 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి

పెన్సిల్వేనియా

  • పెన్సిల్వేనియాలో రేపటి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం
  • పెన్సిల్వేనియా రాష్ట్రంలో 20 ఎలక్టోరల్‌ ఓట్లు
  • పెన్సిల్వేనియాలో 89 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి
  • పెన్సిల్వేనియాలో లెక్కించాల్సిన ఓట్లలో బైడెన్‌కే ఎక్కువ వచ్చే అవకాశం
  • పెన్సిల్వేనియాలో లక్షా 64 వేల ఓట్ల ఆధిక్యంలో ట్రంప్‌
  • పెన్సిల్వేనియాలో 6 లక్షల నుంచి లక్షా 64 వేలకు తగ్గిన ట్రంప్‌ ఆధిక్యం
  • పెన్సిల్వేనియాలో ఇంకా లెక్కించాల్సిన 11 శాతం ఓట్లు
  • పెన్సిల్వేనియా ఓట్ల లెక్కింపు మరో 48 గంటలు పట్టే అవకాశం
  • పెన్సిల్వేనియాలో నెగ్గితే అధ్యక్ష పదవి బైడెన్‌ కైవసం

07:38 November 05

అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారన్నది దాదాపుగా తేలిపోయింది. అగ్రరాజ్యం రాజకీయాల్లో కురువృద్ధుడైన డెమొక్రటిక్ అభ్యర్థి, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌... శ్వేతసౌథంలోకి అధ్యక్ష హోదాలో అడుగుపెట్టడానికి కేవలం ఆరు ఎలక్టోరల్‌ ఓట్ల దూరంలో ఉన్నారు.

ఇప్పటివరకు 45 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడగా బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు 270 ఎలక్టోరల్ ఓట్లు గెలిచిన అభ్యర్థి అధ్యక్ష పీఠంపై కూర్చోనున్నారు. అటు ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లతో రెండోసారి అధ్యక్షపీఠం అధిష్ఠించే అవకాశానికి దాదాపు దూరమయ్యారు.

మ్యాజిక్​ ఫిగర్​ '270'...

బైడెన్‌ ఆధిక్యంలో ఉన్న నెవెడా ఫలితాలపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రాంత ఫలితాల ఆధారంగా నూతన అధ్యక్షుడు ఎవరనేది తేలనుంది. కీలక స్వింగ్ స్టేట్‌లలో ఆధిక్యం కనబరచిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. చివరిలో నిర్ణయాత్మక రాష్ట్రాల్లో ఓటమి చవిచూశారు. ఫలితంగా రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించే అవకాశానికి దాదాపు దూరం అయ్యారు. మిషిగన్‌, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల ఓటింగ్‌, కౌంటింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేసిన ట్రంప్‌.. న్యాయస్థానాల్ని ఆశ్రయించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-ఫలితాలు

  • మొత్తం ఎలక్టోరల్ ‌స్థానాలు: 538
  • ఫలితాలు వెలువడిన స్థానాలు: 437
  • జో బైడెన్‌ గెలిచిన స్థానాలు: 264
  • డొనాల్డ్‌ ట్రంప్‌గెలిచిన స్థానాలు: 214

మరో 6 స్థానాలే..

  • ఫలితాలు రావాల్సిన రాష్ట్రాలు: 5
  • ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాలు: 4
  • బైడెన్‌ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాలు: 1
  • ఫలితాలు వెలువడాల్సిన స్థానాలు: 60
  • ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాల్లో స్థానాలు:54
  • బైడెన్‌ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాల్లో స్థానాలు: 6

06:33 November 05

6 సీట్ల దూరంలోనే డెమొక్రటిక్​ అభ్యర్థి బైడెన్​

అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్‌, ప్రత్యర్థి బైడెన్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే డెమొక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ కీలక రాష్ట్రాలను గెలుచుకుంటూ ముందంజలో ఉన్నారు. మిషిగన్‌(16)లో విజయం సాధించిన బైడెన్‌.. ఇప్పటివరకు 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. మరో 6 సీట్లు సాధిస్తే మ్యాజిక్​ ఫిగర్​ అందుకోనున్నారు​. ప్రస్తుతం రిపబ్లికన్​ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్‌ 214 ఓట్లతో ఉన్నారు.

ఇదీ చూడండి: అధ్యక్ష పీఠం దిశగా బైడెన్​- కీలక రాష్ట్రాలు కైవసం

Last Updated : Nov 5, 2020, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details