రుణఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అమెరికా కోర్టులో చుక్కెదురైంది. ఒకప్పుడు తాను పరోక్షంగా యజమానిగా ఉన్న మూడు కంపెనీల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను కొట్టేయాలని నీరవ్ మోదీతో పాటు ఆయన సహచరులు చేసిన విజ్ఞప్తిని న్యూయార్క్‌లోని దివాలా కోర్టు తోసిపుచ్చింది.
అమెరికా కేంద్రంగా పని చేసే ఫైర్‌స్టార్ డైమండ్, ఫాంటసీ ఇంక్, ఏ జాఫ్ సంస్థలకు మోదీ ఒకప్పుడు పరోక్షంగా యజమానిగా ఉండేవారు. అయితే... పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక.. ఆ మూడు సంస్థలకు కోర్టు ట్రస్టీని నియమించింది.