తెలంగాణ

telangana

ETV Bharat / international

'వాణిజ్య యుద్ధానికి నాలుగు వారాల్లో తెర'

వాణిజ్య ఒప్పందం కోసం చైనాతో జరుగుతున్న చర్చలు మరో నాలుగు వారాల్లో ముగుస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆకాంక్షించారు. శ్వేతసౌధంలో చైనా వాణిజ్య రాయబారి ల్యూ హేతో ఆయన భేటీ అయ్యారు.

By

Published : Apr 5, 2019, 6:30 AM IST

Updated : Apr 5, 2019, 7:45 AM IST

డొనాల్డ్​ ట్రంప్​

చైనాతో వాణిజ్య చర్చలపై ట్రంప్​ సంతృప్తి

చైనాతో జరుగుతున్న వాణిజ్య చర్చలు మరో నాలుగు వారాల్లో కొలిక్కి వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్నాయి.

" ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గర్లో ఉన్నాం. చర్చల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది" అని ట్రంప్​ అన్నారు. శ్వేతసౌధంలో చైనా వాణిజ్య రాయబారి ల్యూ హేతో ఆయన భేటీ అయ్యారు.

ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం జరిగాక... చైనా అధ్యక్షుడితో తాను భేటీ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పారు ట్రంప్​.

ఏడాది కాలంగా వాణిజ్య యుద్ధం

ఒప్పందం కోసం జరుగుతున్న చర్చల్లో అమెరికా లేవనెత్తిన వాణిజ్య ఆందోళనలన్నీ చైనా పరిగణలోకి తీసుకోవాలని ట్రంప్​ ఇది వరకే వ్యాఖ్యానించారు.
చైనాతో వాణిజ్య యుద్ధానికి గతేడాది తెరతీశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​. అమెరికా ఎగుమతులపై అధిక సుంకం వేస్తూ చైనా అధిక లాభం పొందుతోందని అగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ సాంకేతికతను డ్రాగన్​ దేశం అనైతికంగా కొల్లగొడుతోందని అన్నారు.

అప్పటి నుంచి అమెరికా, చైనా పోటీ పడి మరీ ఎగుమతులపై సుంకాలను పెంచుకుంటూ వస్తున్నాయి. దాదాపు 360 బిలియన్​ డాలర్ల సుంకాలను గతేడాది నుంచి పరస్పరం విధించుకున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం పడింది. ఆ తర్వాతి నుంచి చర్చల ద్వారా వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాయి ఇరు దేశాలు. అప్పటి నుంచి చర్చలు కొనసాగుతున్నాయి.

Last Updated : Apr 5, 2019, 7:45 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details