తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో మంచు తుపాను బీభత్సం

అమెరికాలో భారీ మంచు తుపాను ఏర్పడింది. రాఖీ పర్వతాల నుంచి విపరీతమైన వేగంతో శీతల పవనాలు వీస్తున్నాయి. పలురాష్ట్రాల్లో తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి.

అమెరికాను వణికిస్తోన్న మంచు తుపాను​

By

Published : Mar 14, 2019, 11:33 AM IST

అమెరికాను వణికిస్తోన్న మంచు తుపాను​

అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. ఉత్తర రాఖీ పర్వతాల నుంచి గంటకు 148 కిలోమీటర్ల వేగంతో శీతలపవనాలు వీస్తున్నాయి. ఈ భారీ హిమపవనాలకు తోడు, వరదలు, టోర్నెడోల (సుడిగాలులు) ధాటికి చాలా రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. 27 రాష్ట్రాల్లో అధికారులు తుపాను హెచ్చరికలు జారీ చేశారు.

దట్టంగా పేరుకుపోతున్న మంచు వల్ల కొలరాడో, దక్షిణ డకొటా, నెబ్రాస్కాల్లోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విపరీతంగా హిమపాతం కురుస్తోంది. దీని వల్ల విమాన సేవలు నిలిపివేశారు. భారీ ఈదురుగాలులకు తోడు పిడుగులు పడి చాలా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details