సాయుధ దళాల్లో సేవలందిస్తూ వీరమరణం పొందిన వారిని స్మరించుకునే 'వార్షిక సెలవు' దినానికి కొన్ని రోజుల ముందు ట్విట్టర్లో అమెరికా సైన్యం... మాజీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులకు ఓ ప్రశ్న వేసింది. ఆర్మీలో పనిచేసిన రోజుల్లో, ఆ తర్వాత ఏ విధంగా ప్రభావితమయ్యారు? ఎంత బాధను అనుభవించారు? అని అడిగింది.
సైన్యం అడిగిన ప్రశ్నకు సుమారు 10 వేలకు పైగా సమాధానాలు వచ్చాయి. అందులో తమ కొందరు వివరాలను వెల్లడించలేదు. సమాధానాల సంఖ్య మాత్రం ఇప్పటి వరకు అగ్రరాజ్యం చేసిన యుద్ధాల సంఖ్యను సూచిస్తోంది.
" ఇరాక్‌లో యుద్ధం చేసి మా తండ్రి ఇంటికి తిరిగొచ్చారు. అప్పటి నుంచి అసంబద్ధంగా, నిరంతరం కోపంగా, అనుమానస్పదంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు చాలా రకాల వైద్యాలు చేయించాం. కానీ ఇప్పటికీ ఆయన మానసిక, భౌతిక ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇరాక్‌లో జరిగిన పరిణామాలతోనే ఆయన కచ్చితంగా ప్రభావితమై ఉంటారు."
- ఓ వ్యక్తి సమాధానం
2001లో అఫ్గానిస్థాన్, 2003లో ఇరాక్‌పై యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా. ఈ ఘర్షణల్లో వేల మంది అగ్రరాజ్య సైనికులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఇప్పటికీ అమెరికా బలగాలు ఇరు దేశాల్లో మోహరించి ఉన్నాయి.
అఫ్గానిస్థాన్, ఇరాక్‌లో యుద్ధాల కోసం అమెరికా బలగాలను వినియోగించటాన్ని పేర్కొంటూ.. " ఓఈఎఫ్ (ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడం), ఓఐఎఫ్ (ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడం)ల కారణంగా పీటీఎస్డీ (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్), ధీర్ఘకాల నొప్పిని అనుభవిస్తున్నాం" అని ట్విట్టర్లో ఓ మాజీ జవాను స్పందించారు.