పాకిస్థాన్ వద్ద ఉన్న ఎఫ్-16 యుద్ధ విమానాల ఆధునికీకరణకు 125 మిలియన్ డాలర్ల విలువైన సైనిక అమ్మకాలను చేపట్టాలని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ కాంగ్రెస్‌కు తెలిపింది. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అమెరికా పర్యటన ముగిసిన కొద్ది రోజుల్లోనే అగ్రరాజ్యం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పాక్ వద్ద ఉన్న ఎఫ్-16ల సంఖ్య 54కు చేరుతుంది.
2018 జనవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం మేరకు.. పాక్‌కు రక్షణ సహకారాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇప్పటికీ ఆ నిషేధం కొనసాగుతోంది. కానీ ఇప్పుడు పాక్‌కు సైనిక సహకారం అందించాలని నిర్ణయించడం గమనార్హం.
పాక్ అభ్యర్థన మేరకే...
పాకిస్థాన్ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. రక్షణ అమ్మకాల్లో భాగంగా అమెరికా తన ప్రతినిధులను పాక్‌లో నియమిస్తుంది. వీరు ఎఫ్-16 వినియోగంపై నిరంతరం పర్యవేక్షణ చేస్తారు. అమెరికా సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం కాకుండా చూస్తారు. ఇది అమెరికా విదేశాంగ విధానానికి, జాతీయ భద్రతకు తోడ్పడుతుందని అధికారులు తెలిపారు.
భారత్‌పై ఎఫ్-16 ప్రయోగం మాటేంటి?