ఉత్తర కొరియా పరిమితికి మించి చమురు దిగుమతులు చేసుకుంటూ ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఉల్లంఘిస్తోందని ఆమెరికా, మరో 25 దేశాలు ఆరోపిస్తున్నాయి. 5 లక్షల బ్యారెళ్ల రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల వార్షిక పరిమితిని మించి ఎక్కువ దిగుమతి చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్యాంగ్యాంగ్ నిబంధనలు ఉల్లంఘించిందని, వెంటనే అది తన దిగుమతులను నిలిపివేయాలని యూఎస్ కోరింది. ఉత్తర కొరియా చర్యలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పర్యవేక్షించాలని అభ్యర్థించింది. ఉత్తర కొరియా అధిక పెట్రోలియం ఉత్పత్తులను డజన్ల కొలది అక్రమ ఓడల్లో తరలిస్తోందని ఆరోపించింది.