తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎన్​ఆర్​సీలో లేకున్నా వారినలా చూడొద్దు: ఐరాస - అసోం

అసోం జాతీయ పౌరసత్వ జాబితాలో పేర్లు రాని వారినెవరినీ పౌరసత్వం లేని వ్యక్తులుగా చూడొద్దని ఐక్యరాజ్యసమితి భారత్​ను కోరింది. జాబితాలో లేని వారందరికీ అవసరమైన న్యాయసాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.

ఎన్​ఆర్​సీలో లేకున్నా వారినలా చూడొద్దు: ఐరాస

By

Published : Sep 1, 2019, 6:08 PM IST

Updated : Sep 29, 2019, 2:10 AM IST

అసోంలో జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్​ఆర్​సీ) తుది జాబితా నుంచి 19 లక్షల మంది పేర్లు గల్లంతైన వేళ ఐక్యరాజ్యసమితి స్పందించింది. పేర్లు రాని వారినెవరినీ పౌరసత్వం లేని వ్యక్తులుగా చూడొద్దని భారత్​ను కోరింది ఐరాస.

జాతీయత లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలను వదిలివేసే ఏ ప్రక్రియ అయినా... పౌరసత్వలేమిని అడ్డుకునే తమ ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.

'న్యాయసాయం అందించండి'

భారత్​ ఇప్పుడే ఎవరినీ పౌరసత్వం లేనివారిగా నిర్ధరించవద్దని ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి ఫిలిప్పో గ్రాండి కోరారు. జాబితాలో లేనివారందరికీ కావాల్సిన న్యాయసాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన ఎన్​ఆర్​సీ జాబితాలో 3 కోట్ల 11 లక్షల మందికి చోటు దక్కింది. మరో 19 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి:ఎన్‌ఆర్‌సీలో 19.06 లక్షల మందికి దక్కని చోటు

Last Updated : Sep 29, 2019, 2:10 AM IST

ABOUT THE AUTHOR

...view details