UN climate resolution: వాతావరణ మార్పులకు, ప్రపంచ భద్రత సవాళ్లకు సంబంధించి ఐరాస భద్రత మండలి రూపొందించిన నమూనా తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. వాతావరణ మార్పులకు సంబంధించి ఇటీవల గ్లాస్గో శిఖరాగ్ర సమావేశంలో అతి కష్టమ్మీద కుదిరిన ఏకాభిప్రాయానికి ఇది వ్యతిరేకంగా ఉందని తేల్చి చెప్పింది. ఈ తీర్మానంలోని అంశాలు సభ్య దేశాల మధ్య అసమ్మతి బీజాలు నాటేలా ఉన్నాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్.తిరుమూర్తి సోమవారం పేర్కొన్నారు.
Russia vetoes UNSC climate
'వాతావరణ సంబంధ భద్రత ముప్పు'ను కేంద్రంగా భావించి, వ్యూహాలను సిద్ధం చేయాలన్న సారాంశంతో... ఐర్లండ్, నైగర్‌లు ఈ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే, తన వీటో అధికారాన్ని ఉపయోగించి రష్యా దీన్ని అడ్డుకొంది. భారత్ సైతం దీనికి వ్యతిరేకంగా ఓటు వేసింది.