తెలంగాణ

telangana

ETV Bharat / international

'బహిరంగంగా టీకా తీసుకునేందుకు సిద్ధం' - ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్​

కరోనా టీకాను బహిరంగంగానే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఐరాస కార్యదర్శి గుటెరస్​ వెల్లడించారు. అది తన నైతిక బాధ్యతగా అభివర్ణించారు. మరోవైపు టీకా పంపిణీ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు గుటెరస్​. అభివృద్ధి చెందిన దేశాలు టీకా పంపిణీకి వేగంగా ప్రణాళికలు రచిస్తుంటే.. పేద దేశాలు మాత్రం వాటిని చూస్తూ ఉండిపోతున్నాయని పేర్కొన్నారు.

UN chief says will take COVID-19 vaccine publicly, calls it his 'moral obligation'
బహిరంగంగా టీకా తీసుకునేందుకు సిద్ధం: గుటెరస్​

By

Published : Dec 10, 2020, 10:45 AM IST

కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చినప్పుడు.. బహిరంగంగానే టీకా తీసుకునేందుకు తాను సిద్ధమని ప్రకటించారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​. అది తన నైతిక బాధ్యతని పేర్కొన్నారు.

టీకా అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్​ చేయించుకోవాలని పిలుపునిచ్చారు గుటెరస్​. టీకాను తీసుకుంటే వైరస్​ను వ్యాప్తి చేయమని.. ఫలితంగా ఇది యావత్​ ప్రపంచానికే మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్​ తీసుకోవడం సేవతో సమానమన్నారు.

ఇదీ చూడండి:-'నిరసన చేపట్టే హక్కు రైతులకు ఉంది'

'టీకా జాతీయవాదం పెరుగుతోంది...'

ప్రపంచవ్యాప్తంగా 'టీకా జాతీయవాదం' వేగంగా పెరుగుతోందని హెచ్చరించారు గుటెరస్​. ఫలితంగా.. అభివృద్ధి చెందిన దేశాల వ్యాక్సిన్​ సన్నద్ధతను పేద దేశాలు చూస్తూ ఉండిపోతున్నాయని పేర్కొన్నారు. తమకు టీకా ఎప్పుడు అందుతుందా అని వారు ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా టీకా అందుబాటులో ఉండాలని పునరుద్ఘాటించారు గుటెరస్​. ముఖ్యంగా అఫ్రికాకు అందించాలని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన 'కోవాక్స్​' కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఆఫ్రికాలోని పేద దేశాలకు టీకాలు అందించడానికి ఇదే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:-ఐరాస చీఫ్​కు బైడెన్​ ఫోన్​- కొవిడ్​పై చర్చ

ABOUT THE AUTHOR

...view details