భారత్ సహా జీ-20 దేశాలు స్వచ్ఛమైన, సుస్థిర ఇంధనంలో పెట్టుబడులు పెట్టాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ పిలుపునిచ్చారు.
ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇనిస్టిట్యూట్(టీఈఆర్ఐ) నిర్వహించిన దర్బారి సేఠ్ 19వ స్మారక వేడుకల్లో గుటెర్రస్ దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛమైన ఇంధనం, వినియోగ అంతరాన్ని తగ్గించటం ముఖ్యమని పేర్కొన్నారు.
"భారత్లో ఇప్పటికీ శిలాజ ఇంధనాలపై ఇచ్చే రాయితీలు స్వచ్ఛమైన ఇంధనాలకన్నా ఏడు రెట్లు అధికం. 2019-20లో బొగ్గుపై రాయితీలు 206 కోట్ల డాలర్లు దాటాయి. మొత్తంగా శిలాజ ఇంధనాలపై 1,100 కోట్ల డాలర్ల రాయితీలు ఇచ్చారు. అయితే కరోనా సమయంలోనూ భారత్లో మొత్తం వినియోగంలో పునరుత్పాదక శక్తి నిష్పత్తిని 17 శాతం నుంచి 24 శాతానికి పెంచటం అభినందనీయం."