కరోనాతో అల్లాడుతున్న భారత్కు ఐక్యరాజ్య సమితి అండగా నిలబడుతోంది. ఐరాసకు చెందిన పలు సంస్థలు ఇప్పటివరకు 10 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను భారత్కు పంపించాయి. కోటికిపైగా మెడికల్ మాస్కులను చేరవేశాయి. ఈ విషయాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజరిక్ తెలిపారు.
కరోనాను ఎదుర్కొనేందుకు భారత్లో జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో సహాయ కార్యక్రమాలను చేపడుతున్నాట్లు డుజరిక్ వెల్లడించారు.
"యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ, యూఎన్ఎఫ్పీఏలు కలిసి భారత్కు సుమారు 10 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, కోటి మాస్కులు, 15 లక్షల ఫేస్ షీల్డ్లు పంపించాయి. వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లను సైతం ఐరాస కొనుగోలు చేసింది. కరోనా టీకాల నిల్వ కోసం కోల్డ్ చైన్ పరికరాలను యునిసెఫ్ అందిస్తోంది. కరోనా పరీక్షల యంత్రాలు, ఎయిర్పోర్ట్ థర్మల్ స్కానర్లను పంపుతున్నారు. తాత్కాలిక అవసరాల కోసం టెంట్లు, బెడ్లను డబ్ల్యూహెచ్ఓ అందిస్తోంది. వేలమంది వైద్య నిపుణులను అందుబాటులో ఉంచింది."
-స్టీఫెన్ డుజరిక్, ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి