ఇండో పసిఫిక్ ప్రాంతంలో(Indo Pacific) చైనా ఆగడాలను ఎదుర్కొనేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ మూడు దేశాలు కలిసి త్రైపాక్షిక కూటమిని(AUKUS Alliance) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇండో పసిఫిక్(Indo Pacific) ప్రాంతంలో తమ ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకునేందుకు, రక్షణ సామర్థ్యాలను పంచుకునేందుకు, ఆస్ట్రేలియాకు న్యూక్లియర్ సబ్మెరైన్ సామర్థ్యాన్ని సంపాదించుకునేలా సాయం చేసేందుకు 'ఆకస్' (ఏయూకేయూఎస్)(AUKUS Alliance) పేరుతో ఈ కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి.
వర్చువల్ సమావేశంలో..
బుధవారం జరిగిన వర్చువల్ సమావేశంలో.. ఈ కొత్త కూటమిని(AUKUS Alliance) ఏర్పాటు చేస్తున్నట్లు మూడు దేశాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden news), బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ పాల్గొన్నారు. ఆకస్ కూటమి కింద.. తమ ఉమ్మడి సామర్థ్యాలు, సాంకేతిక భాగస్వామ్యం అభివృద్ధి చేయడానికి మూడు దేశాలూ అంగీకరించాయి. రక్షణ సంబంధింత శాస్త్ర, సాంకేతికత, పారిశ్రామిక స్థావరాలు, సరఫరా గొలుసులను బలోపేతం చేసేందుకు ఆమోదం తెలిపాయి.