తెలంగాణ

telangana

ETV Bharat / international

బిల్​గేట్స్​పై ఆగని విమర్శలు.. నెట్టింట మళ్లీ చర్చ - Expose Bill Gates trending news

ప్రముఖ వ్యాపారవేత్త బిల్​గేట్స్​పై మరోసారి నెట్టింట చర్చ మొదలైంది. కరోనా వంటి మహమ్మారి పుట్టుక వెనుక ఆయన హస్తం ఉందని నెటిజన్లు చర్చిస్తున్నారు. డబ్ల్యూహెచ్​ఓ,సీడీసీ సహా ప్రభుత్వాలు అతడి చేతుల్లో కీలు బొమ్మల్లా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌ల ద్వారా బిల్​గేట్స్​ ట్రాకింగ్ పరికరాలను ప్లాంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇటీవలే ఆరోపణలు రాగా.. ఆయన వాటిని ఖండించారు.

Expose Bill Gates
బల్​గేట్స్​పై ఆగని విమర్శల పర్వం.. నెట్టింట మరోసారి ట్రెండింగ్​

By

Published : Jun 14, 2020, 11:30 AM IST

Updated : Jun 14, 2020, 11:45 AM IST

ప్రపంచంలో ఎంతో మందిని కబళించి, మరెంతో మందిని బాధితులను చేసింది కరోనా వైరస్​ రక్కసి. అలాంటి ఈ ప్రాణాంతక మహమ్మారిని నియంత్రించేందుకు భారీ మొత్తంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు సమకూర్చిన కుబేరుడు బిల్​గేట్స్. ఇప్పటికే ఆయన ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ దాదాపు 2 వేల కోట్లు విరాళం అందించింది. పేదలకు ఆహార పంపిణీ సహా కరోనా వైరస్​ వ్యాక్సిన్​ తయారీ కోసం భారీగానే ఖర్చుచేస్తున్నారు గేట్స్​. అలాంటి వ్యక్తిపై ఎన్నో కుట్ర సిద్ధాంతాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఇటీవలే అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మళ్లీ నెట్టింట చర్చ నడుస్తోంది.

ఇదే కారణమా...!

ప్రపంచవ్యాప్తంగా లాక్​డౌన్​కు మద్దతివ్వడం, వ్యాక్సిన్​ తయారీలో భాగమవడంపై ఇతడిపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. జనాభా నియంత్రణ, మహమ్మారి విషయంలో గతంలో ఆయన కొన్ని వేదికలపై మాట్లాడిన వ్యాఖ్యలను.. 'ఎక్స్​పోజ్ బిల్​గేట్స్​' పేరుతో​ ట్వీట్లు చేస్తున్నారు.

ట్రాకింగ్ ఆరోపణలపై​...

కొవిడ్ వ్యాక్సిన్‌ల ద్వారా ఆయన ట్రాకింగ్ పరికరాలను ప్లాంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇటీవలె అతడిపై కొందరు ఆరోపించారు. వాటి విషయంపై మీడియాతో మాట్లాడిన గేట్స్​.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

"నాకు ఎలాంటి మైక్రోచిప్ సంబంధిత విషయాలతో సంబంధం లేదు. ఇలాంటి తెలివి తక్కువ చెత్తను ఖండించడం కూడా కష్టంగానే ఉంది" అని బిల్​గేట్స్​ మండిప్డడారు.

చాలా సంవత్సరాలుగా మహమ్మారుల విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలంటూ గేట్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కొవిడ్-19 మీద పోరాటానికి, వ్యాక్సిన్ తయారీకి 300 మిలియన్ డాలర్ల సహకారం అందించనున్నట్లు బిల్ అండ్ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్ టెడ్ టాక్‌లో భాగంగా ప్రకటించింది. దాని ఆధారంగా కొందరు వ్యక్తులు సరికొత్త సిద్ధాంతాలను పుట్టించారు. కరోనా వైరస్‌ సృష్టి, వ్యాప్తికి గేట్స్‌ కారణమని, దాన్నుంచి ఆయన లబ్ది పొందనున్నారని వాటి సారాంశం.

దీనిపై గేట్స్ మాట్లాడుతూ.."మా ఫౌండేషన్‌కు వ్యాక్సిన్లు కొనడానికి డబ్బు అందింది. మేం ఈ మహమ్మారి తీవ్రతను గుర్తించాం. అందుకే దాని గురించి మాట్లాడుతున్నాం" అని స్పష్టం చేశారు. కానీ, గేట్స్ చుట్టూ అల్లుకున్న పుకార్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం మాత్రం ఆగలేదు. యాహూ న్యూస్‌, యూగవ్ నిర్వహించిన సర్వేలో 28 శాతం మంది అమెరికన్లు ఈ విషయాలను నమ్ముతున్నట్లు చెప్పారు. 44 శాతం మంది రిపబ్లికన్లు, 50 శాతం మంది ఫాక్స్ న్యూస్ వీక్షకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ 61 శాతం మంది ఎంఎస్‌ఎన్‌బీసీ వీక్షకులు మాత్రం అవన్నీ తప్పుడు సిద్ధాంతాలని కొట్టిపారేశారు.

ఇలాంటి సిద్ధాంతాలు తనను బాధించడం లేదని గేట్స్‌ చెప్పుకొచ్చారు. అయితే వ్యాక్సిన్ పట్ల ఉన్న చెడుప్రచారం కారణంగా.. ఒకవేళ వ్యాక్సిన్ కనిపెట్టినా, పెద్ద ఎత్తున ప్రజలకు చేరడం కష్టంగా మారుతుందేమోననని ఆందోళన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ చేరితేనే వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తుందన్నారు. ఒకసారి వ్యాక్సిన్ వచ్చిన తరవాత వైద్య సదుపాయాలు సరిగా లేని, భౌతిక దూరం పాటించడం సాధ్యంకాని ప్రాంతాలకు తొలుత అందించాలని సూచించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 115 రకాల వ్యాక్సిన్​లపై పరిశోధనలు జరుగుతున్నట్లు వివరించారు గేట్స్​. వీటిలో కనీసం 10 వ్యాక్సిన్లు మెరుగైన ఫలితాలు ఇవ్వొచ్చన్నారు. వైరస్​ను నిలువరించాలంటే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల వ్యాక్సిన్​​ డోసులు అందుబాటులో ఉంచాలని ఆయన వెల్లడించారు.

Last Updated : Jun 14, 2020, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details