తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్ వద్దన్నా బైడెన్​కే ఆ ఖాతాను అప్పగిస్తాం' - బైడెన్ పోటస్ ట్విట్టర్ ఖాతా

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే జనవరి 20న అధికారిక ఖాతా '@POTUS'ను బదిలీ చేస్తామని ట్విట్టర్ ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోయినా.. బైడెన్​కు అప్పగిస్తామని స్పష్టం చేసింది.

TWITTER-BIDEN-POTUS
బైడెన్

By

Published : Nov 21, 2020, 4:06 PM IST

అమెరికా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ఖాతా '@POTUS'ను జనవరి 20న కొత్త అధ్యక్షుడు జో బైడెన్​కు అప్పగించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఓటమిపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ అంగీకరించకపోయినా.. బైడెన్​కు పోటస్​ను బదిలీ చేస్తామని స్పష్టం చేసింది.

ఈ విషయానికి సంబంధించి ట్రంప్​తో పాటు బైడెన్​ బృందానికి ఎలాంటి సమాచారం ఇవ్వనక్కరలేదని ట్విట్టర్ తెలిపింది. ప్రస్తుతం ఆ ఖాతాలో ఉన్న ట్వీట్లన్నీ భద్రపరచి.. ఖాళీ అకౌంట్​ను బైడెన్​కు అప్పగిస్తామని వెల్లడించింది.

ఇదే విధంగా శ్వేతసౌధం (@whitehouse), ఉపాధ్యక్షురాలు (@VP), తొలి మహిళా (@FLOTUS) ఖాతాలను బదిలీ చేస్తామని ట్విట్టర్ తెలిపింది. గత ఎన్నికల్లోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరించామని పేర్కొంది.

ఇదీ చూడండి:'చట్టానికి లోబడే అధికార మార్పిడి'

ABOUT THE AUTHOR

...view details