తెలంగాణ

telangana

ETV Bharat / international

క్యాపిటల్​ రగడ: ట్రంప్​ ఖాతాను లాక్​ చేసిన ట్విట్టర్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు ట్విట్టర్​, ఫేస్​బుక్​ షాకిచ్చాయి. కాపిటోల్​ భవనం వద్ద జరిగిన అందోళనల నేపథ్యంలో ట్రంప్​ చేసిన పోస్టులపై ఆ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రంప్​ చేసిన వీడియోని ఫేస్​బుక్ తీసివేస్తే.. ట్విట్టర్​ 12 గంటల పాటు అధ్యక్షుడి ఖాతాను నిలిపివేసింది.

Twitter locks account of outgoing US President Donald Trump for 12 hours following removal of three of his tweets
ట్రంప్‌ ఖాతాను లాక్‌ చేసిన ట్విట్టర్‌

By

Published : Jan 7, 2021, 6:45 AM IST

Updated : Jan 7, 2021, 9:13 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ ఖాతాను ట్విట్టర్​ లాక్ చేసింది. 12 గంటల పాటు లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తమ నియమాలకు విరుద్ధంగా ఉన్నట్వీట్లను వెంటనే తొలగించాలని ట్రంప్​ని కోరింది. సంబంధిత ట్వీట్లు తొలగించకపోతే ఖాతాని లాక్​ చేసే ఉంచుతాం అని స్పష్టం చేసింది. దీనిపై అధ్యక్షుడి నుంచి స్పందన లేకపోవడం చూసిన ట్వీట్టర్​.. ట్రంప్‌ చేసిన రెండు ట్వీట్లను తొలగించింది.

ఫేస్​బుక్​ది అదే దారి...

ఆందోళనకారులు సంయమనం పాటించాలంటూ ఫేస్​బుక్​లో ట్రంప్‌ పోస్టు చేసిన వీడియో సందేశాన్ని ఫేస్​బుక్​ యాజమాన్యం తొలగింది. ట్రంప్‌ మద్దతుదారుల ఆందోళనల దృష్ట్యా వీడియో తొలగించామని ఫేస్‌బుక్‌ వివరణ ఇచ్చింది.

ఇదీ చూడండి: ట్రంప్​ మద్దతుదారుల ఆందోళన హింసాత్మకం

Last Updated : Jan 7, 2021, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details