సామాజిక మాధ్యమాల దిగ్గజం ట్విట్టర్ సేవలకు బుధవారం గంటపాటు అంతరాయం కలిగింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడిందని వెబ్సైట్ల వైఫల్యాలను గుర్తించే సంస్థ డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. భారత్, జపాన్, బ్రిటన్, దక్షిణ అమెరికా, ఐరోపా, ఉత్తర అమెరికాల్లోని ట్విట్టర్ వినియోగదారులకు ఈ సమస్య ఎదురైనట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా గంటపాటు ట్విట్టర్ సేవలకు అంతరాయం
బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత్ సహా వివిధ దేశాల్లోని వినియోగాదారులు దాదాపు గంటపాటు ఈ సమస్య ఎదుర్కొన్నారు. అయితే, ఈ విషయంపై ట్విట్టర్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ప్రపంచ వ్యాప్తంగా గంటపాటు ట్విట్టర్ సేవలకు అంతరాయం
ఈ సమయంలో ట్విట్టర్ యాప్ ఓపెన్ చేసిన వారికి 'సమ్‌థింగ్ వెంట్ రాంగ్, ట్రై అగైన్' అనే వాక్యం దర్శనమిచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు సాఫ్ట్వేర్లలోనూ ఈ అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ట్విట్టర్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అనంతరం సేవలు పునఃప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: హైడ్రామాకు సీబీఐ బ్రేక్.. చిదంబరం అరెస్టు
Last Updated : Sep 27, 2019, 8:27 PM IST