అమెరికా ప్రతినిధుల సభలో బుధవారం అభిశంసనపై ఓటింగ్ చేపట్టనున్నట్లు స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రకటించడాన్ని తప్పుపట్టారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అభిశంసన ప్రక్రియను ఆపాలని కోరుతూ.. పెలోసీకి లేఖ రాశారు. తనపై అభిశంసనతో డెమొక్రాట్లు .. హక్కుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు ట్రంప్.
"డెమొక్రాట్ చట్టసభ్యులు రాజ్యాంగ విరుద్ధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి అభిశంసన ప్రక్రియ చేపట్టారు. రెండున్నర శతాబ్దాల అమెరిక శాసన చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. మీరు అభిశంసన ప్రాధానాన్ని తగ్గిస్తున్నారు. అభిశంసన చర్యతో ముందుకు వెళితే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లే. రాజ్యాంగంపై మీ విధేయతను ఉల్లంఘిస్తున్నారు. అమెరికా ప్రజాస్వామ్యంపై బహిరంగ యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు."
- స్పీకర్‌కు లేఖలో ట్రంప్