తెలంగాణ

telangana

ETV Bharat / international

అలస్కాలో ట్రంప్​ విజయం- జార్జియాలో రీకౌంటింగ్​ - trump on alaska votes latest

అలస్కాలో వెలువడిన తాజా ఎన్నికల ఫలితాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ విజయం సాధించారు​. ఇక్కడ ఉన్న మూడు ఎలక్టోరల్​ సీట్లను గెలుపొందారు. దీంతో ఆయన ఎలక్టోరల్​ సంఖ్య 217కు పెరిగింది.

trump wins alaska electoral seats
అలస్కాలో ట్రంప్​ విజయం-పెరిగిన ఎలక్టోరల్​ సంఖ్య

By

Published : Nov 12, 2020, 5:06 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. తాజాగా అలస్కాలో వెలువడిన ఫలితాల్లో ఆయన విజయం సాధించారు. తన ఎలక్టోరల్‌ సంఖ్యను 217కు పెంచుకున్నారు.

అలస్కాలో ట్రంప్‌ 56.9శాతం ఓట్లు సాధించారు. ప్రెసిడెంట్‌ ఎలక్ట్ జో బైడెన్‌ 39.1శాతం ఓట్లు మాత్రమే పొందారు. అయితే ఈ విజయం జోబైడెన్ అధ్యక్షుడయ్యే అవకాశాలపై ఏమాత్రం ప్రభావం చూపదు. ఇప్పటికే బైడెన్ అధికారానికి కావాల్సిన 270 కంటే ఎక్కువ ఓట్లనే సాధించారు.

జార్జియాలో రీకౌంటింగ్​..

మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో జార్జియాలో పోలైన ఓట్లను తిరిగి లెక్కించనున్నట్లు రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జియా మంత్రి బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్ ప్రకటించారు. ట్రంప్ కంటే ప్రెసిడెంట్‌ ఎలక్ట్ జో బైడెన్ కేవలం 14 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నందున ఓట్ల లెక్కింపును మొదట్నుంచి మళ్లీ చేతులతో లెక్కించేందుకు నిర్ణయించామని ఆయన తెలిపారు.

ఇక్కడ16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా బైడెన్‌ విజయం సాధించారు. జార్జియాలో భారీగా ఓటరు మోసం, ఎన్నికల దుర్వినియోగం జరిగిందని ట్రంప్ ఆరోపించారు. ఇందుకు ఎలాంటి ఆధారాలూ చూపలేదు. జార్జియాతో పాటు మిచిగాన్, పెన్సిల్వేనియా, నెవాడా, అరిజోనాలో తిరిగి ఓట్లను లెక్కించాలని ఆయన పలు కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. అయితే జార్జియా లేకున్నా అధ్యక్షుడు కావడానికి అవసరమైన మెజారీటీ బైడెన్‌కు ఉందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details