తెలంగాణ

telangana

ETV Bharat / international

గ్రీన్​కార్డు కాదు... ఇకపై 'బిల్డ్ అమెరికా' వీసా - ఇమ్మిగ్రేషన్

గ్రీన్​ కార్డు... అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి. గ్రీన్​కార్డ్​ కోసం వేలాది మంది ప్రవాస భారతీయులు అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నిరీక్షణ సమయం తగ్గనుంది. నైపుణ్యం ఉన్నవారికి త్వరితగతిన శాశ్వత నివాస అనుమతి రానుంది. పనిలో పనిగా... గ్రీన్​కార్డ్​ పేరు కూడా మారనుంది.

అమెరికా

By

Published : May 17, 2019, 1:30 PM IST

అమెరికా వలస​ విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. విదేశీయులకు అమెరికాలో శాశ్వత నివాసం కల్పించే గ్రీన్​కార్డు స్థానంలో 'బిల్డ్​ అమెరికా' వీసాను తీసుకురాబోతున్నారు.

శాశ్వత నివాస అనుమతుల జారీలో నైపుణ్యం ఉన్నవారికి పెద్ద పీట వేసింది అమెరికా సర్కారు. ఇప్పటివరకు గ్రీన్​కార్డు అర్హుల్లో అధిక శాతం బంధుత్వపరంగా వచ్చినవారే. ఈ విధానంతో నైపుణ్యం ఉన్నవారిని తప్పనిసరిగా దేశం నుంచి పంపించాల్సి వస్తోందని, ఇది ఇక జరగబోదని ట్రంప్ పేర్కొన్నారు.

"ఈ రకమైన వ్యవస్థ లేకపోవటం వల్ల నైపుణ్యం కలిగినవారు స్వదేశాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది. వారు అక్కడే సంస్థలను స్థాపించటం వల్ల అమెరికా నష్టపోతోంది. ఫలితంగా ఉద్యోగాల సృష్టి కుంటుపడుతోంది. వాళ్లు అమెరికాలోనే కంపెనీలు ప్రారంభించాలి."

- డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

కొత్త వలస విధానం-కీలకాంశాలు

  1. ఏటా 11 లక్షల మందికి గ్రీన్​ కార్డులు అందిస్తుంది అమెరికా. ఈ సంఖ్యలో ఎలాంటి మార్పు లేకుండా నైపుణ్యం కలిగిన ఆశావహులకు కోటాను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న 12 శాతం కోటా 57 శాతం కానుంది.
  2. అమెరికన్​ ఇంగ్లీష్​పై మంచి పట్టు తప్పనిసరి. అమెరికా చరిత్రపైనా కనీస అవగాహన ఉండాలి. సివిక్స్​ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఐదేళ్లపాటు దేశంలో నివసించాలి.
  3. కెనడా తరహాలో ప్రతిభ పాయింట్ల ఆధారంగా ఎంపిక వ్యవస్థ ఏర్పాటు. యువకులు, నైపుణ్యం, ఉద్యోగాలు సృష్టించగలిగేవారు, ఇచ్చేవారు, ఉన్నత విద్య అభ్యసించినవారికి అధిక ప్రాధాన్యం.
  4. అమెరికా పౌరులు, కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా భారీ వేతనం పొందుతున్నవారికే ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.
  5. ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఉండాల్సిందే. జాతీయ ఐక్యత, సమగ్రతను గౌరవించాలి.

ప్రస్తుతం ఇస్తున్న బంధుత్వపరమైన గ్రీన్​కార్డుల సంఖ్య తగ్గినా వారికీ తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు ట్రంప్​.

ఇదీ చూడండి: భారతీయులకు మరింత సులభంగా గ్రీన్​కార్డ్​!

ABOUT THE AUTHOR

...view details