అమెరికా-చైనా మధ్య 15 నెలలుగా నెలకొన్న వాణిజ్యం యుద్ధం ప్రభావం యావత్ ప్రపంచంపై పడింది. సమస్య పరిష్కారానికి ఇరు దేశాలు ఇప్పటివరకు ఎన్నో చర్చలు జరిపాయి. కానీ ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాతో జరుగుతున్న చర్చల్లో భాగంగా ఆ దేశ వైస్ ప్రీమియర్ లియూ హీతో శుక్రవారం సమావేశం కానున్నట్టు ప్రకటించారు.
అమెరికా-చైనా మధ్య గురువారం పునఃప్రారంభమైన ఉన్నత స్థాయి వాణిజ్య చర్చల్లో చైనా బృందానికి లియూ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్రంప్ లీయూల భేటీ ఉండనుంది.
"ఉపాధ్యక్షుడు లియూతో శుక్రవారం నేను శ్వేతసౌధంలో సమావేశం కానున్నాను." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు