తెలంగాణ

telangana

ETV Bharat / international

జీ-20 వేదికగా ట్రంప్​ - జిన్​పింగ్​ భేటీ

జపాన్​లో జరగనున్న జీ-20 దేశాల సదస్సులో భాగంగా అమెరికా, చైనా దేశాధినేతలు భేటీ కానున్నారు. చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​తో ఫోన్​ సంభాషణ అనంతరం భేటీ వివరాలను ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.

జీ-20 వేదికలో ట్రంప్​ - జిన్​పింగ్​ భేటీ

By

Published : Jun 19, 2019, 7:30 AM IST

Updated : Jun 19, 2019, 9:34 AM IST

జపాన్​ ఒసాకాలో వచ్చే వారం జరగనున్న జీ-20 సదస్సులో చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ఈ సమావేశంతో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ముగిసే దిశగా మరో అడుగు పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


గతేడాది భేటీ..

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఏర్స్​​ వేదికగా గతేడాది జరిగిన జీ-20 సదస్సులో ఇరు నేతలు భేటీ అయ్యారు. వాణిజ్య యుద్ధం, సుంకాల్లో సడలింపుపై నాటి సమావేశంలో చర్చించారు. జిన్​పింగ్​తో మాట్లాడిన అనంతరం భేటీ విషయమై ట్విట్టర్​లో ప్రకటించారు డొనాల్డ్.

"మా సమావేశం కొనసాగింపు జపాన్​లోని జీ-20 సదస్సు వేదికగా జరగనుంది. మా భేటీకి ముందుగా రెండు దేశాల అధికారులు చర్చలు ప్రారంభిస్తారు. "

-డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

'అడ్డంకులు తొలగించాలి'

రైతులు, కార్మికులు, వ్యాపారాలకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు పరస్పరం ఆర్థిక సంబంధాలను మెరుగుపరచుకోవాలని అమెరికా తెలిపింది. చైనాతో వాణిజ్యానికి ఉన్న నిర్మాణాత్మక అడ్డంకులను తొలగించాలని పేర్కొంది. ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అంశాలనూ ఇరునేతలు చర్చించారని వెల్లడించింది.

వందల బిలియన్ డాలర్లు విలువ చేసే చైనా వస్తువులపై ట్రంప్ గత మే నెలలో దిగుమతి సుంకాలు పెంచారు. గతేడాది జరిగిన చర్చల నేపథ్యంలో 300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై పన్ను పెంపును తాత్కాలికంగా నిలిపివేశారు. జీ-20 సమావేశం ముగిసిన అనంతరం పన్నుపెంపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

వాణిజ్య లోటు పూడ్చేందుకే..

వాణిజ్య లోటు భర్తీ, చైనా కంపెనీలు మేధోసంపత్తిని దొంగలించడాన్ని ఆపే విషయమై డ్రాగన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ట్రంప్ కోరుతున్నారు. వాణిజ్య విధానాల్లో నిర్మాణాత్మక మార్పులు, సైబర్ హ్యాకింగ్​లో సమస్యలపై చైనా చర్యలు తీసుకోవాల్సిందేనని అమెరికా డిమాండ్ చేస్తోంది.

యుద్ధంతో మిగిలేది ఓటమే: జిన్​పింగ్

ట్రంప్​తో ఫోన్​కాల్​లో మాట్లాడిన అనంతరం భేటీ విషయాన్ని ధ్రువీకరించారు జిన్​పింగ్.

"పరస్పర సహకారం వల్ల చైనా, అమెరికా రెండూ లాభపడతాయి. యుద్ధం వల్ల నష్టమే మిగులుతుంది."

-జిన్​పింగ్

ఇదీ చూడండి: జూన్​ 22న ఆర్థిక వేత్తలతో మోదీ భేటీ

Last Updated : Jun 19, 2019, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details