అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మెక్సికోకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మెక్సికో నుంచి వస్తున్న అక్రమ వలసలను నియంత్రించకపోతే... వచ్చే వారంలోనే అమెరికా దక్షిణ సరిహద్దును మూసివేస్తామని ప్రకటించారు. ఇదే జరిగితే ఇరు దేశాల మధ్య వాణిజ్యపరంగా తీవ్ర ప్రభావం పడుతుంది.
అమెరికా వాణిజ్య విభాగం గణాంకాల ప్రకారం... ప్రస్తుతం అమెరికా, మెక్సికోల మధ్య ప్రతి రోజు 1.7 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. ఒకవేళ సరిహద్దు మూసేస్తే దీనిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతే కాదు దాదాపు 50 లక్షల మంది అమెరికన్ల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుంది.