తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాను జయించిన ట్రంప్- టెస్టుల్లో నెగెటివ్

అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్​కు కరోనా నెగెటివ్​గా తేలింది. వరుసగా నిర్వహించిన పరీక్షలతో పాటు ఇతర మార్గాల్లో ఈ విషయం నిర్ధరణ అయిందని శ్వేతసౌధ వైద్యుడు తెలిపారు. ఇతరులకు ఆయన నుంచి వైరస్ సోకే ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

Trump tests negative for COVID-19, says physician
కరోనా నుంచి కోలుకున్న ట్రంప్- టెస్టుల్లో నెగెటివ్

By

Published : Oct 13, 2020, 6:50 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయనకు వరుస రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్​గా తేలిందని శ్వేతసౌధ వైద్యుడు సీన్ కాన్లే తెలిపారు. వైట్​హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెలీ మెకెననీకి ఈ మేరకు సోమవారం(అమెరికా కాలమానం ప్రకారం) లేఖ రాశారు.

"అధ్యక్షుడు ఆరోగ్యంపై మీరు(శ్వేతసౌధ కార్యదర్శి) అడిగిన సమాచారం పంచుకోగలను. అబాట్ బైనాక్స్​నౌ యాంటీజెన్ కార్డ్ ద్వారా వరుస రోజుల్లో నిర్వహించిన పరీక్షలలో అధ్యక్షుడికి కరోనా నెగెటివ్​గా తేలింది."

-సీన్ కాన్లే, వైట్​హౌస్ డాక్టర్

ఈ ఫలితం కోసం ఒక్క పరీక్షతోనే నిర్ధరణకు రాలేదని సీన్ కాన్లే పేర్కొన్నారు. వరుస యాంటీజెన్ పరీక్షలు, ఆర్​ఎన్ఏ పీసీఆర్ సమాచారం, క్లినికల్-ల్యాబరేటరీ డేటా వంటి ఇతర మార్గాల్లోనూ నిర్ధరించుకున్నట్లు స్పష్టం చేశారు. వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) మార్గదర్శకాల ప్రకారం పరిశీలిస్తే అధ్యక్షుడు ఇతరులకు కరోనా వ్యాప్తి చేసే ప్రమాదం లేదని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details