అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మంకు పట్టు వీడారు. కాంగ్రెస్ ఆమోదించిన కరోనా ఉద్దీపన ప్యాకేజీపై ఎట్టకేలకు సంతకం చేశారు. ఆదివారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించారు ట్రంప్. 900 బిలియన్ డాలర్లతో రూపొందించిన భారీ ప్యాకేజీతో.. కొవిడ్ వల్ల నష్టపోయిన వ్యాపారాలు, ప్రజలకు సాయం చేసేందుకు వీలు కలగనుంది.
పట్టు వీడిన ట్రంప్- కొవిడ్ ప్యాకేజీపై సంతకం - కరోనా ఉద్దీపన ప్యాేకజీ అమెరికా
కరోనా ఉద్దీపన ప్యాకేజీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆదివారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. కొవిడ్ వల్ల నష్టపోయిన ప్రజలకు, వ్యాపారాలకు ఈ ప్యాకేజీ ద్వారా సాయం అందనుంది.
కొవిడ్ ప్యాకేజీపై సంతకం చేసిన ట్రంప్
ప్యాకేజీలో అనవసర అంశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ తొలుత సంతకం చేసేందుకు నిరాకరించారు. ప్యాకేజీని ఆమోదించకపోవచ్చని చెప్పారు. చివరగా ఈ బిల్లుకు సమ్మతి తెలపడం వల్ల ప్రభుత్వాలకు భారీ నిధులు మంజూరు కానున్నాయి. సెప్టెంబర్ వరకు ప్రభుత్వ ఏజెన్సీలకు 1.4 ట్రిలియన్ డాలర్ల నిధులు అందేలా బిల్లు రూపొందించారు. కుటుంబాలకు, నిరుద్యోగులకు సాయం అందించేలా తయారుచేశారు.
ఇదీ చదవండి:లక్షల మంది నిరుద్యోగులకు 'ట్రంప్ దెబ్బ'!