చైనాపై ఘాటు విమర్శలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ఏటా 5 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని చేస్తూ చైనా పునర్నిర్మాణానికి సాయపడితే.. చైనా అందుకు ప్రతిఫలంగా చాలా చెత్త బహుమానాన్ని ఇచ్చిందన్నారు. వైరస్ కేంద్ర స్థానంలోనే దీనిని నియంత్రించడంలో చైనా విఫలమైందని ఆరోపించారు ట్రంప్. అయినప్పటికీ వుహాన్‌ను దాటి చైనాలోని ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాపించలేదని గుర్తుచేశారు.
చైనా పునర్నిర్మాణానికి సాయపడ్డామని.. ఏటా 5వందల బిలియన్ డాలర్లను వ్యాపార రూపంలో అందిస్తున్నామని పునరుద్ఘాటించారు ట్రంప్. చైనాలోని అమెరికా పెట్టుబడిదారులపైనా ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. వారందరినీ మూర్ఖులుగా అభివర్ణించారు.
చైనాతో సహా ప్రపంచదేశాలన్నింటితో కలిసి పనిచేస్తామని ప్రకటించారు ట్రంప్. రవాణా రంగంలో 2మిలియన్ల ఎగుమతులకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే కరోనా లాంటి పరిస్థితి మరోసారి ఉత్పన్నం కాకూడదని చైనాకు గట్టి హెచ్చరికలు చేశారు.