తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాన్​లో అధికార మార్పిడి కోరుకోవట్లేదు : ట్రంప్ - ట్రంప్

ఇరాన్​లో అధికార మార్పిడి తమ లక్ష్యం కాదని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోవడాన్ని ఆపాలని హెచ్చరించారు ట్రంప్.

ఇరాన్​లో అధికార మార్పిడి కోరుకోవట్లేదు : ట్రంప్

By

Published : Jul 17, 2019, 6:40 AM IST

Updated : Jul 17, 2019, 7:56 AM IST

కొంత కాలంగా అమెరికా, ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్​లో అధికార మార్పిడిని తాము కోరుకోవట్లేదని వ్యాఖ్యానించారు. కానీ అణ్వాయుధాలను సమకూర్చుకోవడాన్ని ఆపాలని ఇరాన్​ను హెచ్చరించారు.

"మేం అధికార మార్పిడి కోరుకోవట్లేదు. అది మేం ఎప్పుడూ కోరుకోం. వారు అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించే లక్ష్యంతో గతేడాది ఇరాన్​తో జరగాల్సిన ఒప్పందాన్ని అమెరాకా పక్కన పెట్టింది. అందుకు బదులుగా ఆంక్షలను విధించింది.

2015లో చేసుకున్న అణు ఒప్పందం ప్రకారం ఉండాల్సిన 3.67 శాతం పరిమితికి మించి యురేనియం నిల్వలను సమకూర్చుకున్నట్లు ఇరాన్ గతవారం ప్రకటించింది. యురేనియం నిల్వలపై 300 కిలోల క్యాప్​ను అధిగమించింది.

ఇరాన్​తో ట్రంప్ ఒప్పందాన్ని రద్దు చేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. ముందుగా ఇరాన్​పై వైమానిక దాడులు చేయాలనుకున్న అమెరికా ఓ డ్రోన్​ను ఇరాన్​ పడగొట్టిన కారణంగా దాడిని విరమించుకుంది. చమురు నౌకలపై వరుస దాడులు ఇస్లామిక్ రిపబ్లిక్​కు చెందిన ఉగ్రవాదుల పనిగా అమెరికా గుర్తించింది.

అమెరికా నిప్పుతో ఆడుకుంటోందని ఇరాన్ విదేశాంగ శాఖమంత్రి మహమ్మద్ జావెద్ జారీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: అసోం, బిహార్​లో వరదల బీభత్సం.. 55 మంది మృతి

Last Updated : Jul 17, 2019, 7:56 AM IST

ABOUT THE AUTHOR

...view details