తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ నోట.. చైనాతో వాణిజ్య చర్చల మాట

వాణిజ్య అవగాహనపై చైనా, అమెరికా ప్రతినిధులు అతిత్వరలో సమావేశమౌతారని ప్రకటించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. చర్చలను పునఃప్రారంభించేందుకు చైనా నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ట్రంప్​ నోట.. చైనాతో వాణిజ్య చర్చల మాట

By

Published : Aug 26, 2019, 5:59 PM IST

Updated : Sep 28, 2019, 8:39 AM IST

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరదించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలకు సంబంధించిన ప్రతినిధుల మధ్య వాణిజ్య చర్చలు అతి త్వరలో ప్రారంభమవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించారు.

"సంప్రదింపులను తిరిగి ప్రారంభించేందుకు గతరాత్రి చైనా చేసిన అభ్యర్థన మేరకు వాణిజ్య సంబంధాలపై చర్చలను తిరిగి ప్రారంభించనున్నాం."

-జీ7 వేదికగా ట్రంప్

చర్చలను తిరిగి ప్రారంభించేందుకు చైనా అంగీకరించడం ఒత్తిడిని తగ్గించిందని వ్యాఖ్యానించారు ట్రంప్. చైనా విధానం బాధించిందని కానీ... వారికి సంప్రదింపులే సరైనదని ఇప్పటికి అర్థమై ఉంటుందని తెలిపారు.

మొదటి రెండు స్థానాల్లో కొనసాగేందుకు స్థిరంగా ఉన్నట్లు ట్రంప్ మాటలను బట్టి అర్థమవుతోంది. గత శుక్రవారమే చైనా దిగుమతులపై సుంకాలను పెంచారు డొనాల్డ్. అంతలోనే చర్చలు పునఃప్రారంభమవుతాయని వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మేధోసంపత్తి చౌర్యం సహా... దశాబ్దాలుగా చైనా కొనసాగిస్తూ వస్తున్న వాణిజ్య విధానాన్ని మార్చుకునేందుకు ఒత్తిడి తెస్తోంది అగ్రరాజ్యం.

ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీనికి తెరదించాలని జీ-7 సమావేశం వేదికగా అమెరికాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాయి అమెరికా మిత్రదేశాలు.

ఇదీ చూడండి: కశ్మీర్ సమస్య ద్వైపాక్షికం- మధ్యవర్తిత్వానికి తావులేదు'

Last Updated : Sep 28, 2019, 8:39 AM IST

ABOUT THE AUTHOR

...view details