తెలంగాణ

telangana

ETV Bharat / international

'పన్నులు పెంచినా.. చర్చలు కొనసాగుతాయి' - ఉత్పత్తులు

దాదాపు 200 బిలియన్​ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై 25 శాతం వరకు పన్నులు విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అయినప్పటికీ ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

'పన్నులు పెంచినా... చైనాతో చర్చలు కొనసాగుతాయి'

By

Published : May 11, 2019, 5:35 AM IST

Updated : May 11, 2019, 8:10 AM IST

'పన్నులు పెంచినా... చైనాతో చర్చలు కొనసాగుతాయి'

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల ప్రతినిధులు రెండు రోజులపాటు వాణిజ్య చర్చలు జరుపుతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ స్పష్టం చేశారు.మొత్తం 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై 10 శాతంగా ఉన్న సుంకాలను 25 శాతానికి పెంచింది అమెరికా. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతాయని ట్రంప్​ తాజాగా వరుస ట్వీట్లు చేశారు.

"చైనా ఉత్పత్తులపై విధించిన సుంకాలను తొలగించొచ్చు లేదా అలాగే ఉంచొచ్చు. ఇదంతా భవిష్యత్​లో జరిగే చర్చల మీద ఆధారపడి ఉంటుంది."

"చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, నాకు (ట్రంప్​) మధ్య సంబంధం ఇప్పటికీ చాలా బలంగానే ఉంది."- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

అన్నంత పని చేసిన ట్రంప్​..

ట్రంప్​ తాను ముందు నుంచి చేస్తోన్న హెచ్చరికలను నిజం చేస్తూ, చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచారు. ఈ నేపథ్యంలో బీజింగ్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది.

ప్రతీకారం తప్పదు..

చైనా ఉత్పత్తులపై ట్రంప్​ ప్రభుత్వం సుంకాలు పెంచడంపై చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ విచారం వ్యక్తం చేసింది. ప్రతిచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినప్పటికీ వాషింగ్టన్​లో జరిగే తదుపరి వాణిజ్య చర్చల్లో చైనా ఉపాధ్యక్షుడు లియూ పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​ అభిశంసనకు కోటి సంతకాల సేకరణ

Last Updated : May 11, 2019, 8:10 AM IST

ABOUT THE AUTHOR

...view details