అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా వైరస్ నిర్ధరణకు కావలసిన కిట్ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్ర దేశమైన దక్షిణ కొరియాను కిట్లు సరఫరా చేయాలని కోరారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ వెల్లడించారు. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, సాధ్యమైనంత మేర అమెరికాకు సాయం చేస్తామని తెలిపారు మూన్.
చైనా తర్వాత ఎక్కువ కేసులు నమోదైన దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. కానీ వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించి వైరస్‌ను అంతే వేగంగా నియంత్రించగలిగింది. మంగళవారం వరకు దేశవ్యాప్తంగా 3,67,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆ దేశ యంత్రాంగం తెలిపింది.
వైట్‌హౌస్ స్పందన..