తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇవి దోచుకున్న ఎన్నికలు: డొనాల్డ్​ ట్రంప్​ - trump termed it as stolen election

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని తన నుంచి 'దోచుకున్న' ఎన్నికలు​గా అభివర్ణించారు. అయితే ట్రంప్​ ఆరోపణలను బైడెన్​ వర్గాలు తోసిపుచ్చాయి.

Trump raises questions over electoral process, insists this was a 'stolen election'
అధ్యక్ష ఎన్నికలను 'స్టోలెన్​ ఎలక్షన్'​ గా అభివర్ణించిన ట్రంప్​

By

Published : Nov 9, 2020, 5:45 AM IST

Updated : Nov 9, 2020, 6:16 AM IST

అధ్యక్ష ఎన్నికలపై ఆదివారం ట్విట్టర్​ వేదికగా మరోసారి విమర్శలు చేశారు డొనాల్డ్​ ట్రంప్​. ఓటింగ్​ పూర్తి అవినీతిమయంతో జరిగిందని ఆరోపించారు. వాటిని తన నుంచి దోచుకున్న ఎన్నికలుగా అభిప్రాయపడ్డారు. స్వింగ్​ రాష్ట్రాల్లోని ఓట్ల కోసం మోసాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

" వీళ్లు దొంగలు(బైడెన్​ వర్గం). ఓటింగ్​ అంతా అవినీతిమయం. కొన్ని రాష్ట్రాల్లో అసలు బైడెన్​ గెలవటం అసాధ్యం. వాళ్లు ఏం దోచుకోవాలనుకున్నారో అది దోచుకున్నారు."

--డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ట్రంప్​ అనుకూల వర్గాలు ప్రస్తుతం 'ఎలక్షన్​ డిఫెన్స్​ ఫండ్​' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ఎన్నికల ప్రక్రియపై సుప్రీంకోర్టులో పోరాడేందుకు విరాళాలనూ సేకరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రంప్​ ఓ ఆసక్తికర ట్వీట్​ చేశారు.

"రాడికల్​ లెఫ్ట్​​ సిద్ధాంతాల నుంచి కేవలం నువ్వు(అమెరికా పౌరులు) మాత్రమే అమెరికాను కాపాడగలవు. నీ దేశాన్ని ఎక్కడా తలవంచనీయకు"అని ట్రంప్​ ట్వీట్​ చేశారు.

మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ కూడా డెమొక్రాట్లపై విమర్శలు గుప్పించారు. వాళ్లు అగ్రరాజ్యాన్ని నాశనం చేస్తారని ఆరోపించారు. అయితే వీరిద్దరి​ ఆరోపణలను బైడెన్​ వర్గాలు తోసిపుచ్చాయి.

Last Updated : Nov 9, 2020, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details