డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబైడెన్‌తో పాటు అతని కుమారుడు హంటర్‌పై వెంటనే దర్యాప్తు జరపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ అటార్ని జనరల్ విలియమ్ బార్‌ని కోరారు. ఎన్నికలకు రెండు వారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో దర్యాప్తుని ఆలస్యం చేయకుండా నవంబర్ 3 తేదీకి ముందే చర్యలు తీసుకోవాలని ట్రంప్ సూచించారు.
ఉక్రేయిన్‌లోని ఓ గ్యాస్ కంపెనీ కోసం హంటర్ చేసిన లాబీయింగ్ ప్రయత్నాలకు సంబంధించిన ఈ-మెయిల్, అది ఉన్న సీక్రెట్ ల్యాప్‌టాప్ గురించి న్యూయార్క్ పోస్ట్ పత్రిక ఒక కథనం రాసింది. ఈ విషయంపైనే బైడెన్‌పై దర్యాప్తు చేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఇది పెద్ద అవినీతి అన్న ట్రంప్.. ఎన్నికలకు ముందే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
అయితే ట్రంప్ కోరుతున్న దర్యాప్తుపై న్యాయశాఖ స్పందించలేదు.
ఎన్నికల కోసమే..
ఇక 2020 అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఇప్పుడు కూడా అలాంటి రాజకీయ భూకంపం ఏదైనా పుడితే ట్రంప్ గెలిచేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రిన్సిటన్ యూనివర్సిటీ చరిత్రకారుడు మట్లాడుతూ.. బైడెన్‌పై పైచేయి సాధించటానికి ఆయనకు ఉన్న అన్ని రకాల శక్తులను ట్రంప్ ఉపయోగిస్తున్నారన్నారు.
2016 ఎన్నికల్లోనూ ట్రంప్ విజయానికి ఇలాంటి కేసు ఊతమిచ్చింది. పోలింగ్‌కు సరిగ్గా 11 రోజుల సమయం ఉందనగా హిల్లరీ క్లింటన్‌పై ఎఫ్‌బీఐ డైరక్టర్ జేమ్స్ కామే కేసు ఓపెన్ చేశారు. హిల్లరీ పదవిలో ఉన్న సమయంలో ఓ ప్రైవేట్ ఈ-మెయిల్ సర్వర్‌ను వాడుకున్నారన్నది అభియోగం. వారం రోజుల పాటు దేశం మొత్తం దీనిపైనే చర్చ నడిచింది. ఈ సమయంలో ట్రంప్ ప్రచారంలో దూసుకుపోయారు.
ఇదీ చూడండి:అధ్యక్ష పోరు: ట్రంప్‌కు ఇదే ఆఖరి అవకాశమా?