అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ ఓటర్లు కీలకం కాగా వారు.. వారు ఎటువైపు ఉన్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత సంతతికి చెందిన ఓటర్ల మద్దతు అంతగా లేకపోగా.. క్రమంగా పెరుగుతున్నట్లు తాజా సర్వే చెబుతోంది. అయితే ఇప్పటికీ మెజార్టీ ఇండియన్-అమెరికన్ ఓటర్లు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ వైపే ఉన్నారని ఇండియాస్పోరా, ఆసియా అమెరికన్లు- పసిఫిక్ ద్వీపవాసులు ( ఏఏపీఐ) డేటా కలిసి రూపొందించిన ఓ నివేదిక ద్వారా తెలిసింది.
మారుతున్న లెక్కలు
ప్రస్తుతం అమెరికాలో 18 లక్షల మంది భారతీయ-అమెరికన్లు ఓటు వేయడానికి అర్హులు.
భారతీయ-అమెరిక్ ఓటర్లను అకర్షించేందుకు, భారత్‌తో బలమైన బంధాన్ని నెలకొల్పేందుకు కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష బరిలో దింపారు బైడెన్. దీని ద్వారా భారత సంతతి ఓటర్ల మద్దతును బైడెన్ బాగా ఆకర్షించగలిగారని సర్వేలు చెప్పాయి.
అయితే ఏఏపీఐ చేసిన తాజా సర్వే మాత్రం గతంతో పోలిస్తే ట్రంప్‌కు మన వాళ్ల మద్దతు పెరిగినట్లు తేల్చింది. 66 శాతం మంది ప్రస్తుతం బైడెన్‌కు, 28 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఉండగా, ఆరు శాతం మంది ఏ నిర్ణయాన్ని వెల్లడించలేదని చెప్పింది.