తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉత్తరకొరియాపై అదనపు ఆంక్షల్ని ఎత్తేసిన అగ్రరాజ్యం

ఉత్తరకొరియాపై తాజాగా విధించిన అదనపు ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ను గౌరవిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఉత్తరకొరియాపై అదనపు ఆంక్షల్ని ఎత్తేసిన అగ్రరాజ్యం

By

Published : Mar 23, 2019, 2:41 PM IST

ఉత్తరకొరియాపై అదనపు ఆంక్షల్ని ఎత్తేసిన అగ్రరాజ్యం
ఉత్తరకొరియాపై అమెరికా ఖజానా విభాగం ఆంక్షలను విధించిన వెంటనే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వాటిని తొలగించారు. ఉత్తరకొరియాతో వ్యాపారాలు చేస్తున్న చైనా షిప్పింగ్​ సంస్థలపై అమెరికా ఖజానా విభాగం గురువారం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను ఉద్ధేశించి ట్రంప్​ ట్వీట్​ చేశారు.
ట్రంప్ ట్వీట్

"ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షలకు తోడుగా అమెరికా ఖజానా విభాగం మరిన్ని అదనపు ఆంక్షల్ని విధించింది. వీటిని నేను ఎత్తివేస్తున్నాను"- డొనాల్డ్​ ట్రంప్, ట్విట్టర్

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​తో వియత్నాం వేదికగా జరిగిన చర్చలు విఫలమైన నెల రోజుల లోపే ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఉత్తరకొరియాతో వ్యాపారాలు

ట్రంప్ నిర్ణయాన్ని శ్వేత సౌధ అధికార వర్గాలు సమర్థించాయి.

"అధ్యక్షుడు ట్రంప్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ను గౌరవిస్తున్నారు. ఈ ఆంక్షలు అవసరం లేదని ట్రంప్​ భావిస్తున్నారు."- సారా సాండర్స్, శ్వేతసౌధ కార్యదర్శి

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​తో వియత్నాం వేదికగా జరిగిన చర్చలు విఫలమైన నెల రోజుల లోపే ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details